Sruthi Shanmugha:బుల్లితెర నటి శృతి షణ్ముగ ప్రియ భర్త హఠాన్మరణం.. ఏడాది క్రితం పెళ్లి, అంతలోనే ఇలా
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ బుల్లితెర నటి శృతి షణ్ముగ ప్రియ భర్త అరవింద్ శేఖర్ హఠాన్మరణం పాలయ్యారు. కొన్నేళ్లు డేటింగ్‌లో వీరు గతేడాది మేలో పెళ్లి చేసుకున్నారు. ఏడాదికే అరవింద్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో షణ్ముగప్రియను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. అరవింద్ మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
థియేటర్ ఆర్టిస్ట్ అయిన శృతి.. తిరుమురుగన్ ‘‘నాథస్వరం’’ డైలీ సిట్‌కామ్ ద్వారా అరంగేట్రం చేసింది. వాణి రాణి, కళ్యాణ పరిసు, పొన్నుంచల్ , భారతి కన్నమ్మతో సహా అనేక హిట్ సీరియల్స్‌లో ఆమె నటించింది. శృతి, అరవింద్‌లు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా వుంటారు. వీరి వీడియోలకు పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ వుంది. అరవింద్ స్వతహాగా బాడీ బిల్డర్ కాగా.. వెయిట్ లాస్ కోచ్ కూడా. దీనిపై ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున క్లాసులు కూడా నిర్వహిస్తున్నాడు.
ఆగస్ట్ 2న సాయంత్రం అరవింద్‌కు ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అరవింద్ ప్రాణాలు విడిచినట్లుగా తెలుస్తోంది. ఎంతో అన్యోన్యంగా వుండే అరవింద్- శృతి జంటకు పెద్ద కష్టం రావడంతో ప్రేక్షకులు కంటతడిపెడుతున్నారు. అరవింద్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com