అర్జున్ పెట్టిన కేసును రద్దు చేయాలన్నశృతి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం దేశంలోని హాట్ టాపిక్స్‌లో మీ టూ ఉద్యమం ఒకటి. పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఈ ఉద్యమంలో లైంగిక ఆరోపణలను ఎదుర్కొన్నవారే. అలాంటి వారిలో అర్జున్ ఒకరు. సీనియర్ నటుడు, హీరో అర్జున్‌పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం క్రియేట్ చేసింది నటి శృతి హరిహరన్.
అలాగే కర్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో అర్జున్‌పై కేసు వేసింది. అర్జున్ కూడా శృతిపై సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు వేశారు. 'తాను చేసిన ఆరోపణలను దారి మళ్లించడానికే అర్జున్ తనపై కేసు పెట్టారన్న శృతి ఆ కేసును రద్దు చేయమని పిటిషన్ దాఖలు చేసింది.
మరోవైపు శృతి తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని అర్జున్ కూడా పిటిషన్ పెట్టారు. వీరిద్దరి కేసులు బుధవారం విచారణకు రానున్నాయి. మరి దీనిపై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments