ఎస్ఆర్కే ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 నూతన చిత్రం 'జిలేబి' గ్రాండ్ గా ప్రారంభం

  • IndiaGlitz, [Thursday,October 06 2022]

స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల దర్శకుడు కే విజయ్ భాస్కర్ కొంత విరామం తర్వాత మెగాఫోన్ పడుతున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పిస్తున్నారు. శ్రీ కమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రం లో శివాని రాజశేఖర్ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.విజయ భాస్కర్‌ దర్శకత్వంలోవస్తున్న 13వ చిత్రమిది. ఈ చిత్రానికి 'జిలేబి' అనే ఇంటరెస్టింగ్ టైటిల్ ని ఖరారు చేశారు.

విజయదశమి ని పురస్కరించుకొని ఈ చిత్ర ప్రారంభోత్సవం చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. నిర్మాత స్రవంతి రవి కిషోర్ స్క్రిప్ట్ అందించగా డాక్టర్ రాజశేఖర్ కెమరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ ఇవ్వగా, తొలి సన్నివేశానికి బి గోపాల్ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు కె విజయ భాస్కర్ మాట్లాడుతూ.. చాలా విరామం తర్వాత మళ్ళీ దర్శకత్వం చేయడం ఆనందంగా వుంది. రామకృష్ణ, శ్రీనివాస్ గారితో కలసి సినిమా చేయడం చాలా సంతోషంగా వుంది. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తాం'' అన్నారు.

శివాని రాజశేఖర్ మాట్లాడుతూ.. 'జిలేబి' చిత్రం చేయడం చాలా ఆనందంగా వుంది. విజయ భాస్కర్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలో హీరోయిన్ గా నటించడం ఆనందంగా వుంది. కమల్ నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు'' తెలిపారు

శ్రీ కమల్ మాట్లాడుతూ.. మీ అందరికీ వినోదం పంచడానికి ప్రయత్నిస్తాను. మీ అందరి ఆశీస్సులు కావాలి'' అని కోరారు.

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా, ఎం ఆర్ వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నటీనటులు, శ్రీ కమల్ (పరిచయం) శివాని రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్ , మురళీ శర్మ, గెటప్ శ్రీను, మిర్చి కిరణ్ , గుండు సుదర్శన్ , బిత్తిరి సత్తి తదితరులు

More News

Nagababu: చిరంజీవి అంటే ఎవరికైనా అసూయే... అది ఏ ‘‘పాటి’’కైనా : గరికపాటికి నాగబాబు స్వీట్ కౌంటర్

కొణిదెల నాగబాబు.. మెగా బ్రదర్స్‌లో ఒకరు. ఒడ్డూ, పొడుగు అంతా బాగున్నప్పటికీ ఎందుకో ఆయన హీరోగా క్లిక్ కాలేదు.

Garikapati Narasimha Rao: ‘‘చిరంజీవి గారు .. మీ ఫోటో సెషన్ ఆపుతారా, వెళ్లిపోమంటారా ’’ : స్టేజ్‌పైనే గరికపాటి అసహనం

అవధానులంటే అర్ధం కానీ గ్రంథికాలతో ప్రవచనాలు చెబుతారనే అపోహని తొలగించి..

'అహింస' టీజర్ విడుదల

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్,

సూర్య తెగ నచ్చేస్తున్నాడు... బిగ్‌బాస్ ముందు ఓపెన్ అయిన ఇనయా

ముందురోజు ఎపిసోడ్‌లో గలాటా గీతూ, ఫైమాలను సీక్రెట్‌ రూమ్‌కి పిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంటి సభ్యులపై గాసిప్స్ చెప్పమని గీతూని ఆదేశించాడు బిగ్‌బాస్.

Munugode ByPoll : మునుగోడు ఉపఎన్నిక బరిలో గద్దర్... కాంగ్రెస్, బీజేపీలను వద్దని కేఏ పాల్ పార్టీ నుంచి

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది.