శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హ్యాట్రిక్ చిత్రం
- IndiaGlitz, [Tuesday,April 26 2016]
లౌక్యం, డిక్టేటర్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ హీరోగా సినిమా రూపొందనుంది. గోపీచంద్ హీరోగా, గతంలో లక్ష్యం, లౌక్యం వంటి రెండు సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధమవుతుంది. ఈ చిత్రాన్ని చిత్ర నిర్మాణ రంగంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి.