బాలీవుడ్ యోచనలో శ్రీవాస్...
Send us your feedback to audioarticles@vaarta.com
లక్ష్యంతో హిట్ కొట్టి డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాడు దర్శకుడు శ్రీవాస్. నందమూరి బాలకృష్ణ 99వ చిత్రం డిక్టేటర్ సహా పలు చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత శ్రీవాస్ బాలీవుడ్ సినిమా చేయాలని ప్లాన్స్ చేస్తున్నాడట. ఇంతకు శ్రీవాస్ డైరెక్ట్ చేయాలనుకుంటున్న హీరో ఎవరో కాదు టైగర్ ష్రాఫ్. ఈ యంగ్ హీరోతో శ్రీవాస్ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడట. అందుకు తగిన విధంగా మంచి యాక్షన్ సినిమాకు స్క్రిప్ట్‌ను తయారు చేస్తున్నాడట. టైగర్ ష్రాఫ్‌ను కలిసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడట. అన్ని అనుకుంటున్నట్లు కుదిరితే శ్రీవాస్ బాలీవుడ్ రంగ ప్రవేశం జరిగినట్లే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com