డిక్టేటర్ సాంగ్ పై శ్రీవాస్ కామెంట్..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహాం బాలక్రిష్ణ నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. బాలయ్య పై గం గం గణేషా అనే సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.
కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో ఈపాటను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా డిక్టేటర్ డైరెక్టర్ శ్రీవాస్ ట్విట్టర్ లో స్పందిస్తూ...డిక్టేటర్ మూవీ కోసం గం గం గణేష సాంగ్ ఈరోజుతో సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. బాలయ్యబాబు ఎనర్జీకి హ్యాట్సాఫ్ అంటూ సంతోషం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి కోన వెంకట్, గోపీ మోహన్ కథ అందించారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్నిసంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com