‘పుష్ప’లో ఆ సీన్ తీసిన సుకుమార్‌ను కొట్టావా, నీకు దమ్ముందా : కరాటే కల్యాణిపై శ్రీరెడ్డి ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై సిననీటి కరాటే కళ్యాణి దాడి ఘటనకు సంబంధించిన వివాదం ఇంకా రేగుతూనే వుంది. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గేదే లేదంటూ పంతం పట్టి మీడియాకు , యూట్యూబ్ ఛానెళ్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కరాటే కల్యాణి తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె రాబోయే ఎన్నికల్లో ఒక పార్టీ తరపున టికెట్ ఆశిస్తోందని.. అందుకే పాపులారిటీ కోసమే ఇలా యూట్యూబర్‌పై దాడి చేసిందని ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై శ్రీరెడ్డి స్పందించారు. అంతేకాదు కల్యాణిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడింది.
తాను శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నానని ... ఆ పిల్లోడు వీడియోలు చేస్తే ఇంటికి వెళ్లి కొట్టే హక్కు నీకెవడిచ్చాడు అంటూ బూతుల వర్షం కురిపించింది. సినిమాల్లో అవకాశాలు దొరక్క చాలా మంది యూట్యూబ్‌ను నమ్ముకుని బ్రతుకున్నారని అలాంటి వాళ్లపై దాడులు చేయడం ఏంటని శ్రీరెడ్డి ప్రశ్నించింది. తెలుగు దర్శకులు విదేశీయులకు, ముంబై వాళ్లకు అవకాశాలిస్తారని దీని వల్ల ఎంతో టాలెంట్ ఉన్న తెలుగమ్మాయిలు యూట్యూబ్‌ను నమ్ముకున్నారని ఆమె వాపోయింది.
అలాంటి వాళ్లు ఏదో కష్టపడుతుంటే సంఘసంస్కర్త అంటూ నీ పెత్తనం ఏంటని శ్రీరెడ్డి మండిపడింది. పుష్ప సినిమాలో దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్- రష్మికలతో అసభ్యకరమైన సీన్ చేయించాడని చెప్పి సుకుమార్‌ను వెళ్లి కొట్టావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీవీ యాంకర్‌లు పొట్టి బట్టలు వేసుకుంటున్నారని.. ఆ ప్రోగ్రామ్ నిర్వహించే దర్శకులను వెళ్లి కొట్టావా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. శ్రీకాంత్ రెడ్డికి తల్లిదండ్రులు లేరని యూట్యూబ్‌లో కష్టపడి పేరు సంపాదించుకున్నాడని.. అలాంటి వాళ్లపై దాడి చేయడం ఏంటని నిలదీసింది.
నీ ఏజ్ అయిపోయింది కాబట్టే ఇలాంటి డ్రామాలు చేస్తున్నావ్… నువ్వు బాబి అంటూ చూపించినప్పుడు నిన్ను ఎంతమంది వచ్చి కొట్టారని శ్రీరెడ్డి ప్రశ్నించింది. కరాటే కల్యాణి లాంటి వాళ్లను పార్టిలో ఉంచుకుంటే బీజేపీకి నష్టమేనని చెప్పింది. తెలంగాణ పోలీసులు స్ట్రిక్ట్ అని వాళ్లపై తనకు నమ్మకం ఉందని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. తనకు రెడ్డి అనే ఫీలింగ్ లేదని.. సమంతతో పొట్టి బట్టలు వేయించి ఊ అంటావా ఊహూ అంటావా అనే సాంగ్ చేయించిన దర్శకుడిని కొట్టగలవా అని ప్రశ్నించారు.
శ్రీకాంత్ రెడ్డితో గొడవ సందర్భంగా నీ చేతుల్లో వున్న చిన్నారికి తగలరాని చోట దెబ్బలు తగిలితే ఏమైయ్యేదని ఆమె ప్రశ్నించారు. గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు చేతిలో చంటి పిల్లను ఎందుకు తీసుకెళ్లావని శ్రీరెడ్డి మండిపడ్డారు. శ్రీకాంత్ రెడ్డి చేసే వీడియోలు నచ్చకపోతే .. ప్రేక్షకుడు డోంట్ రికమెండ్ దిస్ ఛానెళ్ అని నొక్కుతాడని, అలాంటప్పుడు నీకెందుకని ఆమె ప్రశ్నించారు. లంకిని, ఢాకిని, శాంకినిలే జుట్టును అలా వీరబోసుకుని తిరుగుతాయని.. టీవీ సీరియల్స్, యూట్యూబ్ ఛానెళ్లకు వచ్చేటప్పుడు చీర సరిగ్గా కట్టుకోవాలని శ్రీరెడ్డి సూచించారు.
యూట్యూబ్‌లో కొన్ని పరిమితులు వున్నాయని.. వాటి ఆధారంగానే యూట్యూబర్‌లు నడుచుకోవాలని , వాటికి అనుగుణంగానే శ్రీకాంత్ రెడ్డి పనిచేస్తున్నాడని ఆమె చెప్పారు. జనాలకు విచక్షణ తెలియకుండానే శ్రీకాంత్ రెడ్డి వీడియోలు చూసేస్తున్నారా అని ప్రశ్నించారు. కొండ మీద కాబోయే భర్తను అమ్మాయి చంపబోయిందని.. ప్రియుడి మోజులో పడి భర్తలను చంపేస్తున్నారని , ఈ మధ్యకాలంలో మగాళ్ల మీద దారుణాలు ఎక్కువైపోతున్నాయని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణం అమ్మాయిలదేనా.. అబ్బాయిలది కాదా అని ఆమె ప్రశ్నించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments