శ్రీరస్తు - శుభమస్తు టైటిల్ సాంగ్ రిలీజ్..
Monday, July 18, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు శిరీష్ - లావణ్య త్రిపాఠి జంటగా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. ఈ మూవీ టీజర్ సినిమా పై అంచనాలను మరింత పెంచేసింది. యువత, సోలో చిత్రాల వలే...దర్శకుడు పరుశురామ్ అందిస్తున్న మరో మంచి చిత్రం అనిపిస్తుంది.
ఈ చిత్రంలో రావు రమేష్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. కుటుంబ విలువను తెలియచెప్పేలా విభిన్న కథాంశంతో రూపొందిన శ్రీరస్తు శుభమస్తు అల్లు శిరీష్ కి సరైన సక్సెస్ అందిస్తుంది అని చిత్రయూనిట్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందించిన శ్రీరస్తు - శుభమస్తు టైటటిల్ సాంగ్ ని వీడియోతో సహా ఈనెల 20న రిలీజ్ చేయనున్నారు. ఇక చిత్రాన్ని ఆగష్టు 5న రిలీజ్ చేయనున్నారు. మరి... అంచనాలకు తగ్గట్టు శ్రీరస్తు - శుభమస్తు విజయాన్ని సాధిస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments