శ్రీరస్తు - శుభమస్తు టైటిల్ సాంగ్ రిలీజ్..

  • IndiaGlitz, [Monday,July 18 2016]

అల్లు శిరీష్ - లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా ప‌రుశురామ్ తెర‌కెక్కించిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు. ఈ మూవీ టీజ‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది. యువ‌త‌, సోలో చిత్రాల వ‌లే...ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ అందిస్తున్న మ‌రో మంచి చిత్రం అనిపిస్తుంది.
ఈ చిత్రంలో రావు ర‌మేష్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించారు. కుటుంబ విలువ‌ను తెలియ‌చెప్పేలా విభిన్న క‌థాంశంతో రూపొందిన శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు అల్లు శిరీష్ కి స‌రైన స‌క్సెస్ అందిస్తుంది అని చిత్ర‌యూనిట్ ఎంతో న‌మ్మ‌కంతో ఉన్నారు. ఎస్.ఎస్.థ‌మ‌న్ మ్యూజిక్ అందించిన శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు టైట‌టిల్ సాంగ్ ని వీడియోతో స‌హా ఈనెల 20న రిలీజ్ చేయ‌నున్నారు. ఇక చిత్రాన్ని ఆగ‌ష్టు 5న రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి... అంచనాల‌కు త‌గ్గ‌ట్టు శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు విజ‌యాన్ని సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

More News

నిహారిక ఆ..పాత్ర చేస్తుందా..

మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన క‌థానాయిక నిహారిక‌. తొలి చిత్రం ఒక మ‌న‌సు ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో నిహారిక రెండో చిత్రం విష‌యంలో ఆలోచ‌న ప‌డింది అంటూ వార్త‌లు వ‌చ్చాయి.

మ‌హేష్ మూవీలో న‌దియా న‌టించ‌డం వెన‌క కార‌ణం ఇదే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్నిఎన్.వి.ప్ర‌సాద్ - ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

చిరు ఆ రైట‌ర్ ని అప్పుడే గుర్తించారు..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ & ఆకుల శివ వ‌ర్క్ చేసారు.

కళ్యాణ్ రామ్ వెర్షెస్ రామ్..

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ఇజం.

హిట్ టాక్ తో ర‌న్ అవుతున్న సెల్ఫీరాజా

అల్లరి నరేష్ నటించిన `సెల్ఫీరాజా` జూలై 15న గ్రాండ్ రిలీజైన సంగతి తెలిసిందే. విడుదల రోజు నుండే అన్నీ ఏరియాల నుండి పాజిటివ్ టాక్ ను రాబట్టుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.