చిరుకు థ్యాంక్స్ తెలియచేసిన శ్రీరస్తు శుభమస్తు టీమ్..

  • IndiaGlitz, [Saturday,August 06 2016]

అల్లు శిరీష్ - లావ‌ణ్య జంట‌గా ప‌రుశురామ్ తెర‌కెక్కించిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు.గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించిన శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రం పాజిటివ్ టాక్ తో విజ‌యవంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి ముఖ్య అతిధిగా వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ....శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రం ఫ్యామిలీ ఆడియోన్స్ ను విశేషంగా ఆక‌ట్టుకోవ‌డం ఖాయం.
ప‌రుశురామ్ అద్భుత‌మైన సంభాష‌ణ‌ల‌తో అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కించాడు. ఈ సినిమా చూస్తుంటే బొమ్మ‌రిల్లు సినిమా గుర్తుకువ‌చ్చింది. మంచి విజ‌యం సాధిస్తుంది అంటూ ఆశీస్సులు అందించారు. చిరు చెప్పిన‌ట్టుగానే శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు మంచి విజ‌యం సాధిస్తుండ‌డంతో హీరో అల్లు శిరీష్, హీరోయిన్ లావ‌ణ్య‌, డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ చిరంజీవి 150 చిత్రం సెట్ కి వెళ్లి చిరంజీవికి థ్యాంక్స్ తెలియ‌చేసారు.