'శ్రీరస్తు శుభమస్తు' శాటిలైట్ హక్కులు...
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా పరుశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు. ఈ చిత్రం ఆగస్ట్ 5న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అల్లు శిరీష్ కెరీర్లో పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమిని టీవీ చానెల్ దాదాపు మూడు కోట్ల రూపాయలను చెల్లించి దక్కించుకుందని విశ్వసనీయ వర్గాల సమచారం. ప్రస్తుతం శిరీష్ శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించనున్న చిత్రం జగదేకవీరుని కథ చిత్రంతో బిజీ కానున్నాడు. ఈ చిత్రం హిస్టారికల్ నేపథ్యంతో పాటు ప్రస్తుతం సాగే లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments