Tamil »
Cinema News »
బొమ్మరిల్లు వలే అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే శ్రీరస్తు - శుభమస్తు విజయం తథ్యం - చిరంజీవి
బొమ్మరిల్లు వలే అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే శ్రీరస్తు - శుభమస్తు విజయం తథ్యం - చిరంజీవి
Sunday, July 31, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు శిరీష్ - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు. ఈ చిత్రాన్ని పరుశురామ్ తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన శ్రీరస్తు - శుభమస్తు చిత్రం ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీరస్తు - శుభమస్తు ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ జె.ఆర్.సి కన్వెషన్ హాల్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరై శ్రీరస్తు - శుభమస్తు చిత్ర బృందానికి ఆశీస్సులు అందచేసారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ...శ్రీరస్తు శుభమస్తు ఆడియో పెద్ద సక్సెస్ అయ్యింది. అల్లు శిరీష్ కెరీర్ లో శ్రీరస్తు - శుభమస్తు పెద్ద చిత్రమై సంచలన విజయం సాధిస్తుంది. అల్లు అరవింద్ గార్కి చిరంజీవి అంటే ఎంత అభిమానమో...శిరీష్ అంటే కూడా అంతే అభిమానం. చిరంజీవిగారి సినిమా సక్సెస్ అయితే అరవింద్ గారు ఎంత ఆనందపడతారో ఈ సినిమా సక్సెస్ అయితే కూడా అంతే ఆనందపడతారు అన్నారు.
డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ...సరైనోడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చిరంజీవి గారు వచ్చి ఆశీర్వదించారు. ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. చిరంజీవి గారి ఆశీర్వాదంతో వస్తున్న శ్రీరస్తు శుభమస్తు కూడా అదే స్ధాయిలో విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను.. శ్రీరస్తు - శుభమస్తు అనే మంచి టైటిల్ పెట్టారు. పరుశురామ్ ఈ సినిమాని అందరికీ నచ్చేలా తెరకెక్కించాడు అనిపిస్తుంది. సిన్సియర్ గా సినిమాలు తీసే నిర్మాతకు సక్సెస్ అనేది ఊపిరి లాంటిది. ఈ చిత్రం సక్సెస్ అవుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ....నా కెరీర్ లో వస్తున్నఫస్ట్ సాఫ్ట్ టైటిల్ ఫిల్మ్ ఇది. పరుశురామ్ శ్రీరస్తు శుభమస్తు అని మంచి సినిమా తీసాడు. ఎస్.ఎస్ తమన్ అని పిలిచే నన్ను శ్రీరస్తు శుభమస్తు తమన్ అని పిలవడం ఆనందంగా ఉంది. అల్లు శిరీష్ లో గౌరవం సినిమా నుంచి ఇప్పటి వరకు చాలా ఛేంజ్ వచ్చింది. ఈ సినిమాలో శిరీష్ చాలా ఈజీగా పర్ ఫార్మె చేసాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత సరైనోడు వలే చాలా పెద్ద ఫంక్షన్ జరుపుకుంటుంది అన్నారు.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ...శ్రీరస్తు - శుభమస్తు సూపర్బ్ టైటిల్ . ఈ టైటిల్ లో సక్సెస్ కనిపిస్తుంది. ఈ చిత్రం అల్లు శిరీష్ - పరుశురామ్ కెరీర్ లో బ్లాక్ బష్టర్ గా నిలుస్తుంది అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...డైరెక్టర్ పరుశురామ్ 6 నెలల పాటు స్ర్కిప్ట్ వర్క్ చేసి..ఆతర్వాత 9 నెలల పాటు ఈ సినిమాని శ్రద్దతో తెరకెక్కించాడు. చిరంజీవి గారు శిరీష్ ని దీవించడానికి వచ్చినందుకు థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. మొన్న సరైనోడు, నేడు శ్రీరస్తు - శుభమస్తు, రేపు ధృవ సూపర్ హిట్ అవుతుంది అన్నారు.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.... గీతా ఆర్ట్స్ లో రెండోసారి అవకాశం ఇచ్చినందుకు అరవింద్ గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. డైరెక్టర్ పరుశురామ్ ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తమన్ బ్యూటీఫుల్ ఆల్బమ్ అందించాడు. శ్రీరస్తు శుభమస్తు పాటలు ప్రతి ఒక్కరికి నచ్చాయి అనుకుంటున్నాను. శిరీష్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన చిరంజీవి గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
అల్లు శిరీష్ మాట్లాడుతూ...కొత్త జంట తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే ఏదో సినిమా చేసేయాలి అని కాకుండా ఈసారి స్ట్రాంగ్ కథ ఉన్న సినిమా చేయాలి.. ఆడియోన్స్ కి బెస్ట్ ప్రాజెక్ట్ ఇవ్వాలి అని ఆలోచించి చేసిన సినిమా ఇది. ఎక్కడ ఆడవాళ్లు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అనే పాయింట్ ను ఎంటర్ టైనింగ్ గా చెప్పాం. తమన్ అద్భుతమైన మెలోడి సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమా చూసిన తర్వాత లావణ్య లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి అనుకుంటారు.
ఇక చిరంజీవి గారి గురించి చెప్పాలంటే... బాధ్యత, ఓపిక, మంచి పని ఎవరు చేసినా ప్రొత్సహించడం..ఈ మూడు విషయాలను చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. మెగా హీరోల ఫంక్షన్స్ కి రావడం బరువులా కాకుండా బాధ్యతలా ఫీలై వస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రొత్సహిస్తున్న చిరంజీవి గార్కి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ...ఈరోజు అల్లు రామలింగయ్య గారి వర్ధంతి. ఆయన్ని జ్ఞాపం చేసుకోవడం మా ధర్మం. ఇక శ్రీరస్తు - శుభమస్తు చిత్రం విషయానికి వస్తే...ఈ చిత్రానికి శ్రీరస్తు శుభమస్తు అని టైటిల్ ఎలా పెట్టారో తెలియదు కానీ... శ్రీరస్తు - శుభమస్తు నేను నటించిన సినిమా. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో నటించాను. చాలా బాగా ఆడింది. ఇప్పుడు ఆ టైటిల్ తో సినిమా వస్తుంది అనేసరికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. నాతో అత్యధిక సినిమాలు నిర్మించిన, అలాగే విజయవంతమైన చిత్రాలు అందించిన సంస్థ అంటే గీతా ఆర్ట్స్ సంస్థ. అల్లు అరవింద్ నాకు నిర్మాతగా దొరకడం నా అదృష్టం. ఆయన ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ సినిమాలు తీస్తున్నారు. ఆయన నెం 1 నిర్మాతగా నిలిచారంటే కృషి, పట్టుదలే కారణం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆడియోన్స్ ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అందుకే విజయం ఆయన వెనకాల పరుగులు తీస్తుంది. శ్రీరస్తు శుభమస్తు గీతా ఆర్ట్స్ లో మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
శ్రీరస్తు - శుభమస్తు ఫస్ట్ కాపీ చూసాను. డైరెక్టర్ పరుశురామ్ చాలా బాగా తీసాడు. ఆడియోన్స్ కట్టిపడేసేలా అద్భుతంగా తెరకెక్కించాడు. రిచ్ ఫాదర్ కి కొడుకు మధ్య సంఘర్షణను చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యేలా కథను బాగా రాసుకున్నాడు. మరీ ముఖ్యంగా డైలాగ్స్ ముత్యాల్లా సందర్భానుసారంగా చాలా బాగున్నాయి. పరుశురామ్ కి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ సినిమా చూసినప్పుడు సక్సెస్ ఫుల్ మూవీ బొమ్మరిల్లు గుర్తుకువచ్చింది. ఆ సినిమా స్ధాయిలో మన్ననలు పొందుతుంది అనుకుంటున్నాను.
శిరీష్ విషయానికి వస్తే...ఈ చిత్రంలో శిరీష్ చాలా కొత్తగా కనిపించాడు. శిరీష్ ఆర్టిస్ట్ అవుతాడు అని అనుకోలేదు. అల్లు అరవింద్ గారిలా నిర్మాత అవుతాడు అనుకున్నాను. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది. ఏ సినిమా ఎందుకు సక్సెస్ అయ్యింది. అని వివరించేవాడు. ఒకరోజు ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పాడు. అలాంటప్పుడు నేను అలా అనుకోలేదు అనకూడదు వెల్ కమ్ చేయాలి అందుకే మనస్పూర్తిగా ఆశీర్వదించాను. శిరీష్ హడావిడిగా సినిమాలు చేసేయాలి అని కాకుండా విలక్షణమైన సినిమాలు చేయాలి అని తనని కొత్తగా ఆవిష్కరించుకుంటున్నందుకు మనస్తూర్తిగా అభినందిస్తున్నాను.
ఇండస్ట్రీలోకి రావడం పెద్ద విషయం కాదు. వచ్చిన తర్వాత కష్టాన్ని నమ్ముకుని శాయశక్తులా ప్రయత్నించాలి. కష్టపడితే ఆ కష్టమే పైకి తీసుకువస్తుంది.ఎప్పుడే అదే చెబుతుంటాను. ఇక లావణ్య విషయానికి వస్తే... సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో అందంగా కనిపించింది. ఈ చిత్రంలో లావణ్య మరింత అందంగా కనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ అంటే వింటున్న కొద్దీ వ్యసనంలా అయిపోతుంది. నా 151వ చిత్రానికి తమన్ ని మంచి ట్యూన్స్ రెడీ చేయమని చెబుతున్నాను. ఫైనల్ గా సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే... అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే శ్రీరస్తు శుభమస్తు విజయం తధ్యం అన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments