శ్రీరస్తు - శుభమస్తు చిత్రానికి సెన్సార్ బోర్డ్ ప్రశంసలు
Wednesday, July 27, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు శిరీష్ - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు. ఈ చిత్రాన్ని పరుశురామ్ తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన శ్రీరస్తు - శుభమస్తు చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.
ఎంటర్ టైన్మెంట్ & ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ రెండింటిని సమపాళ్లో చూపిస్తూ మంచి చిత్రాన్ని రూపొందించారు అంటూ శ్రీరస్తు - శుభమస్తు చిత్ర యూనిట్ ను సెన్సార్ బోర్డ్ ప్రత్యేకంగా ప్రశంసించడం విశేషం. శ్రీరస్తు శుభమస్తు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈనెల 31న గ్రాండ్ గా చేయడానికి ప్లాన్ చేసారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. టీజర్ & ట్రైలర్ తో అంచనాలను పెంచేసిన శ్రీరస్తు - శుభమస్తు చిత్రాన్ని ఆగష్టు 5న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments