శ్రీరస్తు - శుభమస్తు బిగ్ టికెట్ లాంఛ్ చేసిన శిరీష్
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు శిరీష్ - లావణ్య జంటగా నటించిన చిత్రం శ్రీరస్తు - శుభమస్తు. పరుశురామ్ తెరకెక్కించిన శ్రీరస్తు - శుభమస్తు చిత్రం ఈనెల 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా శ్రీరస్తు - శుభమస్తు బిగ్ టికెట్ ను పి.వి.ఆర్ బాక్సాఫీస్ లో అల్లు శిరీష్, లావణ్య, పరుశురామ్ లాంఛ్ చేసారు.
ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ...రేపు శ్రీరస్తు శుభమస్తు చిత్రం రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండే చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో వెళ్లి చూడండి ఓ మంచి చిత్రాన్ని చూసామనే ఫీలింగ్ కలిగిస్తుంది అన్నారు.
లావణ్య మాట్లాడుతూ...ఈ చిత్రంలో నా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది. పరుశురామ్ నా క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేసారు. కుటుంబసమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ శ్రీరస్తు శుభమస్తు అన్నారు.
పరుశురామ్ మాట్లాడుతూ...టీమ్ అంతా కలిసి మంచి చిత్రాన్ని అందించాం. బిగ్ టికెట్ ఈరోజు లాంఛ్ చేసాం. సినిమా చూసిన తర్వాత మీరు పొందిన ఆనందం బిగ్ టికెట్ వలే బిగ్ గా ఉంటుంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com