'శ్రీరస్తు శుభమస్తు' కూడా అంతేనా
Send us your feedback to audioarticles@vaarta.com
జయాపజయాల సంగతి పక్కన పెడితే.. కొందరు దర్శకులు తమ ప్రతిభతో ఇట్టే ఆకట్టుకుంటారు. అలాంటి వారిలో యువ దర్శకుడు పరుశురామ్ ఒకరు. పూరీ జగన్నాథ్ సహాయకుడుగా పనిచేసిన పరుశురామ్ 'యువత'తో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. తొలి చిత్రంతోనే విజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ తరువాత రవితేజతో 'ఆంజనేయులు' చేశారు. అప్పట్లో ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్‌తో రిలీజవడం వార్తల్లో నిలిచింది కూడా. అయితే సినిమా ఆశించిన విజయం సాధించలేదు.
అయినప్పటికీ నారా రోహిత్‌తో తీసిన 'సోలో'తో మెప్పించారీ యువ దర్శకుడు. మళ్లీ రవితేజతో రూపొందించిన 'సారొచ్చారు' బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. దీంతో గ్యాప్ తీసుకున్న పరుశురామ్ అతి త్వరలో అల్లు శిరీష్‌తో 'శ్రీరస్తు శుభమస్తు' అంటూ సందడి చేయనున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతానికి పెద్దగా అంచనాలైతే లేవు. కానీ స్టార్ లేని సినిమాలతో చెప్పుకోదగ్గ ఫలితాలను పొందిన వైనం పరుశురామ్‌కి మరోసారి కలసివస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout