శ్రీరామ్ హీరోగో వస్తోన్న హర్రర్ చిత్రం 'బేగంపేట'
Send us your feedback to audioarticles@vaarta.com
ఆమధ్య తమిళంలో మైనా`, సొట్టై` వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ నిచ్చిన సాలోమ్ స్టూడియోస్ తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్న భారీ చిత్రం బేగంపేట`. శ్రీరామ్, లక్ష్మీరాయ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సుమన్ విలన్‌గా ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారని చిత్ర దర్శకుడు వడివుడయాన్ తెలిపారు. వడివుడయాన్ ఇంతకు ముందు తంబి బెట్టోత్తి సుందరం` అనే విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ భారీ హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వడివుడయాన్ వహిస్తున్నారు.
ఈ సందర్భంగా....
చిత్ర దర్శకుడు వడివుడయాన్ మాట్లాడుతూ... బేగంపేట ఒక భయంకరమైన హర్రర్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం. ఇందులో భారీ యాక్షన్ పార్ట్ కూడా ఉండడం విశేషం. ఇటీవల ఈ చిత్రం కోసం హైదరాబాద్ పంజాగుట్టలోని శ్మశానవాటికలో ఫైట్‌మాస్టర్ కనల్ కణ్ణన్ సారధ్యంలో హీరో హీరోయిన్లు శ్రీరామ్, లక్ష్మీరాయ్ 50 ప్రేతాత్మలతో తలపడే దృశ్యాలను వరుసగా పది రోజులు రాత్రిపూట చిత్రీకరించాము. సినిమాలో ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. దీనితోపాటు మరో పది రోజు హైదరాబాద్ లోని లొకేషన్లలో మరికొన్ని దృశ్యాలను తీశాము.
హైదరాబాద్‌లో జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తయారవుతోంది. కెమెరామెన్ శ్రీనివాసరెడ్డిగారు తన కెమెరా పనితనంతో ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి జాన్‌పీటర్ అందిస్తున్న మ్యూజిక్ మరో ఎసెట్‌గా నిలుస్తుంది. హీరోశ్రీరామ్‌కు ఈ చిత్రం ఒక విభిన్నమైన చిత్రం కాగా, ఇటీవల కాంచన, అరణ్మని వంటి సూపర్‌హిట్ చిత్రాలో నటించిన అందాల తార లక్ష్మీరాయ్ బేగంపేట` చిత్రంలో హీరోయిన్‌గా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఇంతవరకు తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న హర్రర్ చిత్రాలకు భిన్నమైన రీతిలో తెరకెక్కుతున్న బేగంపేట` మరపురాని థ్రిల్‌ను కగజేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో మా చిత్రం బేగంపేట` ఒక బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలుస్తుందని మా గట్టి నమ్మకం` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments