శ్రీనువైట్ల పై గృహహింస కేసు

  • IndiaGlitz, [Monday,October 26 2015]

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శ్రీనువైట్లపై అత‌ని భార్య రూప వైట్ల గృహ‌హింస కేసు న‌మోదు చేసింది. 498ఎ సెక్ష‌న్ కింద రూపావైట్ల, శ్రీనువైట్ల‌పై గృహ‌హింస కేసును న‌మోదు చేసింది. ఫ్యాష‌న్ డిజైన‌ర్ అయిన రూపా వైట్ల త‌న భ‌ర్త‌, డైరెక్ట‌ర్ శ్రీనువైట్ల సినిమాల‌కు డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేసింది. అయితే రీసెంట్ గా శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన ఆగ‌డు, బ్రూస్ లీ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద అనుకున్న స్థాయిలో విజ‌యాల‌ను అందుకోలేదు. ఇప్పుడు శ్రీనువైట్ల‌కు ఇదొక కొత్త రూపంలో మ‌రో స‌మ‌స్య ఎదురైంది. అయితే ఈ విష‌యంపై శ్రీను, రూప వైట్లల నుండి ఎటువంటి స‌మాధానం లేదు.