శ్రీను ఐ మిస్ యూ మూవీ లోగో, బ్యానర్ ,ట్రైలర్ లాంచ్

  • IndiaGlitz, [Wednesday,February 08 2017]

తోట మల్లికార్జున సమర్పణలో శ్రీ సూర్య నారాయణ క్రియేషన్స్ బ్యానర్ పై రాజేంద్ర ప్రసాద్ ను దర్శకుడి పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం శ్రీను ఐ మిస్ యూ . శ్రీను నిర్మిస్తున్న ఈ చిత్రం లోగో , బ్యానర్ ,ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ చిత్రం బ్యానర్ లోగోను రామసత్యనారాయణ ఆవిష్కరించగా టైటిల్ లోగో ను సాయి వెంకట్,ట్రయిలర్ ను ఆర్ కె గౌడ్ లాంచ్ చేసారు.ఈ కార్యక్రమానికి సీనియర్ నటి కవిత.ప్రతాని రామ కృష్ణ గౌడ్.సాయి వెంకట్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ అతిధులుగా హజరై చిత్రయూనిట్ ను అభినందించారు...అనంతరం
నిర్మాత నటుడు శ్రీను మాట్లాడుతూ..మొదట షార్ట్ ఫిలిం అనుకున్నాం కానీ ..ఈ కాన్సెప్ట్ ను దర్శకుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పాకు సినిమా చేద్దాం అన్నాను..దాని దర్శకుడు కూడా సరే అనడంతో ముందుకెళ్తున్నాము.. ఈ చిత్రంలో ఓ పాత్ర పోషిస్తున్నాను.. అందరూ బాగా చేస్తున్నావ్ అంటున్నారు ఆ ధైర్యంతో త్వరలో షూట్ కి వెళ్తాము అన్నారు.
దర్శకుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..నేను దర్శకత్వం చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని కోరుకుంటాను.శ్రీను గారు కేవలం ట్రైలర్ కి లక్షలు ఖర్చు పెట్టారు ఆయనలో మంచి నటుడున్నాడు సినిమా పరిశ్రమలో అవకాశం కోసం తిరిగి చివరికి ఆయనే నిర్మాతగా నటుడిగా నిలబడాలని పట్టుదలతో ఈ సినిమా తీస్తున్నారు ..నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత శ్రీను గారికి థాంక్స్ అన్నారు.
సీనియర్ నటి కవిత...ఈ సినిమా తీసి అవయవ దానం గొప్ప తనం గురించి తెలియచెప్పబోతున్న దర్శకుడు రాజేంద్రప్రసాద్ , నిర్మాత నటుడు శ్రీను మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు.ఒక పిచ్చివాడు తన హృదయాన్ని దానం చేయడం ఎంత గొప్ప విషయం.తప్పని సరిగా ఈ సినిమా తీసి ట్రెండ్ సెట్టర్ గా నిలబడాలని కోరుకుంటున్నాను.
ఆర్ కె గౌడ్ మాట్లాడుతూ..ట్రైలర్ చాల బాగుంది .సినిమా ఇండస్ట్రీకి మంచి జరుగు తుంది. అలాగే మంచి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయాలనీ మానుండి ఎటువంటి సహాయం కావాలన్నా మేము రెడీ అన్నారు.
రామసత్యనారాయణ మాట్లాడుతూ..ఈ నేను రెండు పాయింట్స్ మాట్లాడతాను ఒకటి తీయ బోయే సినిమా పాయింట్ ని ఇలా ప్రదర్శించడం వల్ల దర్శకుడు బాగా తీస్తాడా ? శ్రీను నటన ఎలా ఉంటుంది అని మా సమక్షము లో చూసుకోవడం ఎంతో ఉపయోగకరమైన విషయం.రెండు ఒక సినిమా తీసి చేతులు కాల్చుకోవడం కంటే ముందే కొద్దిగా షూట్ చేసుకుని చూసుకోవడం.ఈ పద్దతిని సినిమా తీయబోయే వాళ్ళు అనుసరిస్తే సినిమా పరిశ్రమ బాగుపడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి వెంకట్ ,తోట మలిఖార్జున్ పాల్గోన్నారు..