శ్రీనివాసరెడ్డి అలా అడిగేశాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
`గీతాంజలి`, `జయమ్ము నిశ్చయమ్మురా` సినిమాలతో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు శ్రీనివాసరెడ్డి. ఓ వైపు కేరక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూనే ఆయన హీరోగా నటించిన తాజా సినిమా `జంబలకిడి పంబ`. ఈ సినిమాకు మను దర్శకుడు. రవి, జోజో, శ్రీనివాసరెడ్డి నిర్మాతలు.
ఈ సినిమాను ఈ నెల 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్‌ను శుక్రవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన రవి మాట్లాడుతూ `` శ్రీనివాసరెడ్డి దగ్గరకు ఈ కథతో వెళ్లగానే `అసలు నిర్మాతలు నిర్మాణ విలువలను పాటిస్తూ సినిమా చేయగలరా?` అనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే మేం సంగీత దర్శకుడిగా గోపీసుందర్‌ని ఎంపిక చేసుకున్నాక ఆయన అనుమానం నివృత్తి అయి సినిమా చేయడానికి అంగీకరించారు`` అని అన్నారు. దీన్ని బట్టి చూస్తే హీరోగా సినిమా చేస్తామని ఎవరు బడితే వాళ్లు వెళ్తే శ్రీనివాసరెడ్డి అంగీకరించడం లేదన్నమాట. సినిమా తీసేవారు ఎవరు? వాళ్లు ప్రమోషన్ సరిగా చేయగలరా? విడుదల చక్కగా చేయగలరా? వంటివాటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తున్నట్టు అర్థమైంది.
ఈ సినిమాలో నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయో, శ్రీనివాసరెడ్డి అనుకున్న రీతిలో సినిమా ఉందో లేదో తెలియాలంటే ఈ నెల 14 వరకు ఆగాల్సిందే. ఆ రోజే ఈ సినిమా విడుదల కానుంది మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments