'శ్రీ‌నివాస క‌ళ్యాణం'తో అయినా బ్రేక్ అవుతుందా?

  • IndiaGlitz, [Sunday,April 15 2018]

యువ కథానాయకుడు నితిన్‌కు పాత టైటిల్స్‌పైన మక్కువ ఎక్కువ. అందుకే  తన సినిమాల కోసం ఎక్కువగా  పాత‌ టైటిల్స్ పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ యంగ్ హీరో. అయితే.. ఆ టైటిల్స్  మాత్రం నితిన్‌కు అనుకున్నంత స్థాయిలో క‌లిసి రావ‌డం లేదు. పాత‌ టైటిల్స్ పెట్టుకున్న ప్ర‌తీసారి నితిన్‌కు అప‌జ‌యం ఎదుర‌వుతూనే ఉంది. ఒక్కసారి ఆ టైటిల్స్.. ఆ సినిమాల వివరాల్లోకి వెళితే.. 2005లో విడుదలైన ‘అల్లరి బుల్లోడు’తో నితిన్ పాత‌ టైటిల్స్ ప్రయాణం మొదలైంది.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డ‌లేక‌పోయింది. అలాగే.. 2008లో జి.వి.సుధాకర్ నాయుడు డైరెక్షన్‌లో నితిన్ న‌టించిన ‘హీరో’ కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. అంతేగాకుండా.. తాజాగా నితిన్ సొంత సంస్థ అయిన శ్రేష్ఠ్‌ మూవీస్ పతాకంపై పాత టైటిల్‌తోనే నిర్మించిన‌ ‘ఛ‌ల్ మోహ‌న్ రంగ‌’ సినిమా కూడా నితిన్ కెరీర్‌కి  ప్లస్ కాలేదు. ఈ నేప‌థ్యంలో నితిన్ హీరోగా పాత టైటిల్‌తోనే రూపొందుతున్న‌ ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’ సినిమా అయినా విజయం సాధించి.. నెగెటివ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందేమో చూడాలి.