పెద్దోడు చిన్నోడుకి థాంక్స్ చెప్పిన 'శ్రీనివాస కళ్యాణం' చిత్ర యూనిట్
Send us your feedback to audioarticles@vaarta.com
విజయవంతమైన చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన మల్టీస్టారర్ `సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు` సినిమాలో పెద్దోడుగా విక్టరీ వెంకటేశ్, చిన్నోడుగా సూపర్‌స్టార్ మహేశ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్‌డూపర్ హిట్ అయింది. అప్పటి నుండి ఈ సంస్థతో ఇద్దరి ప్రత్యేక అనుబంధం కొనసాగుతుంది.
ఈ ఏడాది ఇదే బ్యానర్‌లో పెద్దోడు విక్టరీ వెంకటేశ్ `ఎఫ్ 2`లో నటిస్తుండగా.. చిన్నోడు సూపర్‌స్టార్ మహేశ్ తన 25వ సినిమా చేస్తున్నారు. అదే అనుబంధంతో ఈ బ్యానర్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `శ్రీనివాస కళ్యాణం` తమ సపోర్ట్‌ను అందించారు. ఈ చిత్రం కోసం వెంకటేశ్ తన వాయిస్ ఓవర్‌ను ఇవ్వగా.. మహేశ్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ మార్క్‌ను దాటింది. ఈ అగ్ర కథానాయకులిద్దరూ చేసిన సపోర్ట్ కు `శ్రీనివాస కళ్యాణం` యూనిట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసింది. నితిన్, రాశీ ఖన్నా, నందితా శ్వేత తారాగణంగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన `శ్రీనివాస కళ్యాణం` ఆగస్ట్ 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments