భారతీయ సంప్రదాయంలో పెళ్లికి గొప్ప విశిష్టత ఉంది. అలాంటి పెళ్లి గురించి.. వాటి గొప్పతనం గురించి వివరించే చిత్రాలు మాత్రం తెలుగులోనే ఎక్కువ అని చెప్పాలి. శతమానం భవతి చిత్రంతో జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు సతీశ్ వేగేశ్న.. పెళ్లి ఔనత్యాన్ని చాటాలనుకుని.. అసలు పెళ్లంటే ఏంటి? ఎలా చేస్తారు? బంధువులు రియాక్షన్ ఎలా ఉంటుంది? అనే అంశాలతో శ్రీనివాస కళ్యాణం అనే కథ రాసుకున్నాడు. ఈసినిమాను కూడా దిల్‌రాజే ప్రొడ్యూస్ చేయడం విశేషం. దిల్‌రాజుకి నిర్మాతగా మంచి సక్సెస్‌ను తెచ్చిపెట్టిన బొమ్మరిల్లు విడుదల రోజునే ఈ సినిమాను విడుదల చేయడం విశేషం. మరి దిల్‌రాజు సెంటిమెంట్ వర్కవుట్ అయ్యిందా? శ్రీనివాస కళ్యాణం ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
కథ:
ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్ల బంధాలు, బంధుత్వాలకు శ్రీనివాస్ (నితిన్) ఎక్కువ విలువ ఇస్తుంటాడు. ఆర్కిటెక్చర్ అయిన శ్రీనివాస్ ప్రాజెక్ట్ కోసం చంఢీగర్ వెళ్లినప్పుడు సిరి(రాశీ ఖన్నా)తో ప్రేమలో పడతాడు. కోటీశ్వరురాలైన సిరి .. తన ఐడెంటిటీ చెప్పకుండా కాఫీ డేలో పనిచేస్తుంటుంది. శ్రీనివాస్, సిరి ఇద్దరూ ప్రేమలో పడతారు. తర్వాతే సిరి తాను కోటీశ్వరురాలినని చెబుతుంది. పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దరూ రెండు కుటుంబాల పెద్దలకు విషయం చెప్పేస్తారు. శ్రీనివాస్ తల్లిదండ్రులు(రాజేంద్ర ప్రసాద్, ఆమని) పెళ్లికి ఒప్పుకుంటారు. అయితే సిరి తండ్రి ఆర్.కె(ప్రకాశ్ రాజ్) హైదరాబాద్‌లో పెద్ద బిజినెస్‌మేన్ . సమయాన్ని డబ్బుతో లెక్కేసే ఆర్.కె. కూతురు సిరి కోసం పెళ్లికి ఒప్పుకుంటాడు. అయితే చిన్నప్పుడు నాన్నమ్మ కోరిక మేర తన పెళ్లిని తన బంధు గణం మధ్యలోఊర్లో చేసుకోవాలనుకుంటాడు శ్రీనివాస్. పెళ్లికి ఓకే చెప్పినట్లే చెప్పి.. చిన్న కండీషన్ పెడతాడు ఆర్.కె... దానికి ఓకే చెప్పాలంటే తన కండీషన్‌కి ఓకే చెప్పాలని ఆర్.కెకి శ్రీనివాస్ కండీషన్ పెడతాడు. ఇంతకీ ఇద్దరి మధ్య ఉండే కండీషన్స్ ఏంటి? శ్రీనివాస్, సిరి పెళ్లి అవుతుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
సమీర్ రెడ్డి కెమెరా వర్క్ బావుంది. మిక్కీ నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సన్నివేశాల్లో సందర్భానుసారం వచ్చే డైలాగ్స్ బావున్నాయి. ప్రీ క్లైమాక్స్‌లో రాజేంద్ర ప్రసాద్ భార్యా భర్తల బంధాన్ని వివరించే తీరు.. అలాగే సితార .. ఆడవాళ్ల గురించి ఎమోషనల్‌గా చెప్పే సన్నివేశాలు బావున్నాయి.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు సతీశ్ వేగేశ్న.. పెళ్లి అనే అంశం చుట్టూనే కథను నడిపించాలనుకున్నాడు. అయితే పాత్రల తీరు తెన్నులను సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. పాత్రల మధ్య ఎమోషన్స్ కనెక్ట్ కాదు. సన్నివేశాలను గ్రిప్పింగ్‌గా రాసుకోలేదు. సినిమాలో కంటెంట్ కనెక్ట్ అయ్యి సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే సన్నివేశం అసలు కనపడదు. కొన్ని సన్నివేశాలకు తగ్గట్లు డైలాగ్స్ బావున్నా.. సన్నివేశాలు పేలవంగా ఉండటమో.. కనెక్ట్ కాకపోవడమో వంటి కారణాలతో సన్నివేశం పండలేదు. మిక్కీ పాటలు ఒకటి కనెక్ట్ కాదు.. పాడుకునేలా లేవు. క్లైమాక్స ఏదో పండుతుంది. అని అనుకుంటే.. నితిన్ పెర్ఫామెన్స్ మంత్రాలు, అర్థాలు చెబుతూ అంత అక్కర్లేదు అనేంతలా అనేలా బోరింగ్‌గా తయారైంది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు టెంపో క్యారీ చేసే సన్నివేశాలు లేవు. సినిమా స్లో నెరేషన్‌లో సాగుతుంది.
వివ్లేషణ:
బొమ్మరిల్లు డేట్‌లో విడుదల చేస్తే.. సినిమా సక్సెస్ కాదు.. బలమైన ఎమోషన్స్ అవసరం. బొమ్మరిల్లు సక్సెస్ కావడానికి కారణం.. అది యూత్, వారి మనోభావాలు చుట్టూ తిరిగే కథాంశం కావడమే. కానీ శ్రీనివాస కళ్యాణం అనేది పెళ్లి అనే పరిణితి చెందిన అంశం చుట్టూనే తిరుగుతుంది కాబట్టి.. అందరికీ కనెక్ట్ కావడం కష్టమే. ప్రస్తుతం యూత్, అర్జున్ రెడ్డి, ఆర్.ఎక్స్ 100 వంటి హార్డ్ హిట్టింగ్ ఎలిమెంట్స్‌కు త్వరగా కనెక్ట్ అయిపోతున్నారు. అలాగే కొత్త కాన్సెప్ట్‌లను ఆదరిస్తున్నారు. పెళ్లి అనే ఎలిమెంట్ ఆధారంగా రాసుకున్న శ్రీనివాస కళ్యాణంలో కథలో , స్క్రీన్‌ప్లేలో కొత్తదనం లేదు. కాస్త మధ్య వయస్కులకు సినిమా కనెక్ట్ కావచ్చునేమో కానీ.. అందరికీ మూవీ కనెక్ట్ కావడం కష్టమే.
బోటమ్ లైన్: సీరియల్‌ను తలిపించే శ్రీనివాసుని కళ్యాణం
Comments