అమలాపురంలో 'శ్రీనివాస కళ్యాణం'
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్, రాశి ఖన్నా, నందితా శ్వేతా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ అమలాపురంలో జరుగుతోంది.
నితిన్, రాశి ఖన్నా, నందితా శ్వేతా, ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, ఆమని, గిరిబాబు తదితరులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఫ్యామిలీ రిలేషన్స్, హ్యుమన్ వాల్యూస్ అనే అంశాల చుట్టూ తిరిగే ఈ సినిమాని ఆగస్టు 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దిల్ తరువాత దాదాపు 15 ఏళ్ళ గ్యాప్‌తో నితిన్, దిల్ రాజు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. ఇందులో నితిన్ ఆర్కిటెక్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి మిక్కీ జే.మేయర్ సంగీతమందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com