రెండు వారాల పాటు 'శ్రీనివాస కళ్యాణం' తొలి షెడ్యూల్
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్, రాశి ఖన్నా జంటగా సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైన విషయం విదితమే. వివాహ బంధం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇదిలా ఉంటే.. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్‌లో.. శుక్రవారం నుంచి తొలి షెడ్యూల్ ప్రారంభమైంది. రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. అనంతరం తదుపరి షెడ్యూల్ కోసం టీమ్ మొత్తం హైదరాబాద్ పయనమవనుంది. కాగా, ఈ చిత్రంలో నందితా శ్వేత కూడా ఓ కీలక పాత్రలో నటించనుంది. మిక్కీ జె. మేయర్ సంగీత సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేసేట్టుగా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. గతంలో దిల్ రాజు, సతీష్ వేగేశ్న కలయికలో ‘శతమానం భవతి’ వంటి కుటుంబ కథా చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com