యాంకర్, కమెడియన్‌కు వైఎస్ జగన్ కీలక పదవులు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటులు, తన సొంత పత్రిక ‘సాక్షి’లో పనిచేసిన ప్రముఖులను కీలక పదవులు వరించాయి. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అంతేకాదు.. సాక్షి దినపత్రిక, టీవీ చానెల్‌లో పనిచేసిన దేవులపల్లి అమర్, రామచంద్రమూర్తితో పాటు పలువురికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక పదవుల్లో కూర్చోబెట్టారు. తాజాగా.. ఇదే సాక్షిలో యాంకర్‌గా పనిచేసిన స్వప్నకు ఎస్వీబీసీలో ఓ పదవి కట్టబెట్టారు. అంతేకాదు.. ఇదే ఎస్వీబీసీలో టాలీవుడ్‌కు చెందిన కమెడియన్ శ్రీనివాసరెడ్డికి కూడా కీలక పదవి వరించింది.
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీతో పాటు డైరెక్టర్లుగా స్వప్న, శ్రీనివాసరెడ్డి ఇద్దరూ కలిసి పనిచేయనున్నారు. వాస్తవానికి ఎస్వీబీసీ బోర్డులో ఛైర్మన్‌తో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులను డైరెక్టర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తున్న విషయం విదితమే. కానీ, ప్రభుత్వం ఈ సారి ఆ సంప్రదాయానికి స్వస్తిపలికి ఇతరులకు అవకాశం కల్పించింది.
ఎవరీ స్వప్న!?
టీవీ9లో దాదాపు పదేళ్లకు పైగా పనిచేసి స్వప్న సాక్షి ఛానెల్‌లో చేరారు. కొన్నాళ్లు అందులో పనిచేసి బయటకు వచ్చినా సాక్షికి కన్సల్టెంట్‌గా పనిచేయడం విశేషం. ప్రస్తుతం 10 టీవీలో పనిచేస్తోన్న స్వప్న సొంతంగా ఓ వెబ్ చానెల్‌ను సైతం నడుపుతున్నారు. దీంతో ద్వారా జగన్ పట్ల తన విధేయతను చాటుకుంటునే ఉన్నారు. నాటి టీడీపీ ప్రభుత్వాని తన ఇంటర్వ్యూల ద్వారా ఇరుకుపెట్టి జగన్‌కు అనుకూలంగా వ్యవహరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నికల సమయంలో జగన్‌కు ఉడతా భక్తిగా సాయంచేసి అధికారంలోకి రావడానికి సహకరించారని జగన్ ఈ కీలక పదవి కట్టబెట్టారని తెలుస్తోంది.
ఎవరీ శ్రీనివాస్ రెడ్డి!?
శ్రీనివాస రెడ్డి టాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా రాణిస్తున్నారు. ఎక్కువగా హాస్యప్రధాన పాత్రలు చేస్తుంటాడు. దర్శకుడు పూరీ జగన్నాధ్ తన చిత్రాలలో మంచి పాత్రలను ఇచ్చి ఇతడిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన ఈయన.. విద్యాభ్యాసాన్నంతా అక్కడే పూర్తి చేశాడు. మిమిక్రీ కళతో బాగా పేరు తెచ్చుకున్నాడు. దీంతో టీవీ రంగంలో చిన్న చిన్న వేశాలు వచ్చాయి. తర్వాత కొన్ని హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ఇతడిలోని ప్రతిభను గుర్తించిన పూరీ జగన్నాధ్ తన సినిమాల్లో అవకాశాలిస్తూ వచ్చారు. అయితే తాజాగా.. శ్రీనివాసరెడ్డికి తాజాగా డైరెక్టర్‌గా పదవిని జగన్ కట్టబెట్టారు. అయితే.. శ్రీనివాసరెడ్డికి ఎలా అవకాశమిచ్చారని చెవులు కొరుక్కుంటున్నారు.
ఇదిలా ఉంటే.. సాక్షిలో పనిచేసిన చాలా మందికి నామినేటెడ్ పదవులు ఇప్పించారని, వారికి జీతాలు రూపంలో ప్రభుత్వ ఖజానా నుంచి లక్షలు దోచిపెడుతున్నారని విపక్షాలు ఓ వైపు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. టాలీవుడ్‌లో పలువురు వైసీపీ పార్టీ కోసం పనిచేసిన వారున్నప్పటికీ.. వారిని పట్టించుకోకుండా జగన్ మాత్రం ఇలా ఎవరికిపడితే వారికి పదవులు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై వైసీపీ నేతల నుంచి.. జగన్ సర్కార్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments