Avatar 2 : అవతార్ 2కి అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్ .. హాలీవుడ్ మెచ్చిన పనితనం.. !!
Send us your feedback to audioarticles@vaarta.com
దశాబ్ధం క్రితం సినీ ప్రియులను అలరించిన అవతార్ సినిమాకు సీక్వెల్‌గా అవతార్ 2 డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పట్లో ఈ సినిమా వచ్చినప్పుడు చిన్నారులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్లలో వారి సందడి బాగా కనిపించింది. అప్పుడు చిన్నారులుగా వున్నవాళ్లంతా ఇప్పుడు పెరిగి పెద్దవాళ్లై వుంటారు. కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం వెంటాడుతూనే వుంటాయి. ఈసారి థియేటర్లకు వచ్చేటప్పుడు వారి వెంట వారి పిల్లలను కూడా తీసుకొస్తారు. అలా ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2ని చూడాలనుకునేవారు కోట్లలో వున్నారు.
160 భాషల్లో రిలీజ్ అవుతోన్న అవతార్ 2:
ఇప్పటికే రిలీజైన అవతార్ 2 ట్రైలర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. పార్ట్ 1లో పండోరా గ్రహంపై కొత్త లోకాన్ని చూపిన జేమ్స్ కెమెరూన్.. ఈసారి సముద్ర గర్భంలో మరో కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లనున్నారు. ఇంగ్లీష్‌తో పాటు మొత్తం 160 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే మన తెలుగులోనూ విడుదలవుతోంది. మన దగ్గర కూడా అవతార్ 2 ఫీవర్ అలుముకుంది. మన స్టార్ హీరోల సినిమాలకు ఎంత సందడి నెలకుంటుందో, అంతే హడావుడి కనిపిస్తోంది. ఎ సెంటర్లతో పాటు బి సెంటర్ల ఆడియన్స్ కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
విదేశాల్లో వుండటం, ఇంగ్లీష్‌పైనా అవసరాలకు గ్రిప్:
ఇదిలావుండగా... అవతార్ 2 మేకింగ్‌లో మన తెలుగువారు కూడా పాలు పంచుకున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు విలక్షణ నటుడు, దర్శకుడు, రచయిత అయిన అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. గతంలో విదేశాల్లోనే వుండి వచ్చిన ఆయనకు హాలీవుడ్ మేకింగ్‌పై ఫుల్ గ్రిప్ వుంది, ఇక ఇంగ్లీష్‌లోనూ పట్టు వుండటంతో అవసరాల అయితేనే బాగుంటుందని అవతార్ 2 టీమ్ బలంగా ఫీక్స్ అయ్యింది. దాంతో ఆ అదృష్టం అవసరాల శ్రీనివాస్‌ని వరించింది.
అవసరాల దర్శకత్వంలో పలానా అబ్బాయి పలానా అమ్మాయి:
జ్యో అచ్యుతానంద, ఊహలు గుసగుసలాడే తదితర సినిమాలకు దర్శకత్వం వహించిన అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం ‘‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’’ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com