'శ్రీమంతుడు' సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ - 'శ్రీముంతుడు' యూనిట్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీమంతుడు. మైత్రి మూవీ మేకర్స్, ఎం.బి.ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్స్ పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదలై మంచి సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది. వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రూపాయల షేర్ ను సంపాదించుకుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ....
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ సినిమా యూనానిమస్ టాక్ తో పెద్ద హిట్ అయింది. మొదటి రోజు నుండి అన్నీ వర్గాల ప్రేక్షకుల నుండి సక్సెస్ టాక్ సంపాదించుకుంది. సినిమా అనుకున్న దాని కంటే పెద్ద సక్సెస్ అయింది. ఈ విజయంలో అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ పార్ట్ గా ఉన్నందుకు అందరికీ థాంక్స్. ఇటువంటి సినిమాని చేయడానికి అంగీకరించిన మహేష్ బాబుగారికి స్పెషల్ థాంక్స్. ఈ విజయంతో ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా మరిచిపోయాను.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మట్లాడుతూ మా బ్యానర్లో వచ్చిన మొదటి సినిమా. ప్రేక్షకు నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నటీనటు, టెక్నిషియన్స్‌కి థాంక్స్. పైరసీని ఎంకరేజ్ చేయవద్దు. సినిమా యూనానిమస్ టాక్‌తో ముందుకెళుతుంది. మంచి కలెక్షన్స్ వస్తుంది. అన్నీ చోట్ల మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి`` అన్నారు.
ఈ కార్యక్రమంలో యలమంచిలి రవిశంకర్, మోహన్(సి.వి.ఎం) తదితరులు పాల్గొన్నారు.
శ్రీమంతుడు` మొదటి రోజు షేర్స్(కోట్లలో)
నైజాం - 5.60
సీడెడ్ - 2.90
కృష్ణా - 1.20
గుంటూరు - 2.05
న్లెూరు - 0.60
ఈస్ట్ - 1.71
వెస్ట్ - 1.90
వైజాగ్ - 1.05
కర్ణాటక - 2.02
తమిళనాడు - 0.56
నార్త్ ఇండియా - 0.92
యు.ఎస్.ఎ - 8.55
ఓవర్సీస్ - 1.08
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com