'శ్రీమంతుడు' మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Friday,August 07 2015]

ఒక బాగా డబ్బున్న తండ్రికి, వ్యతిరేక భావాలున్న కొడుకు, ప్రేమ కోసం, కుటుంబం కోసం, తండ్రి కోసం ఏదైనా చేయాలనుకోవడం సింపుల్ గా చెప్పాలంటే ఇదే శ్రీమంతుడు కాన్సెప్ట్. మరి ఇప్పుడు కాన్సెప్ట్ తో పాటు స్టార్ స్టేటస్ కూడా సినిమాల రేంజ్ ను మార్చేస్తున్నాయి. అందుకు ఉదాహరణలు కోకొల్లలు. అలాంటి ఉదాహరణగా శ్రీమంతుడు' చిత్రాన్ని తీసుకోవచ్చు. ఇప్పటి వరకు సినిమాల్లో నటన వరకు పరిమితం అయిన మహేష్ తొలిసారి ప్రొడ్యూసర్ గా మారి నటిస్తూ, ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా చేయడంతో సినిమా స్పాన్ పెరిగింది. మహేష్ గత చిత్రాలు నేనొక్కడినే', ఆగడు' చిత్రాలు అభిమానులనే కాదు, బాక్సాఫీస్ ని కూడా నిరాశ పరిచాయి. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో మహేష్ చేసిన ప్రయత్నమే శ్రీమంతుడు'. మిర్చి వంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు కొరటాల ఈ చిత్రానికి దర్శకుడు కావడం, మహేష్ ఫస్ట్ లుక్, టీజర్ లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. మరి ఈ అంచనాలను శ్రీమంతుడు అందుకున్నాడా? తెలియాలంటే సమీక్షలోకి వెళదాం...

కథ

పెద్ద బిజినేస్ మేన్, పాతికవేల కోట్లకు అధిపతి రవికాంత్(జగపతిబాబు), అతని భార్య(సుకన్య). తన ఫ్యామిలితో బిజినేస్ వ్యవహారాలు చూసుకుంటూ హ్యపీగా లైఫ్ లీడ్ చేస్తున్నప్పటికీ రవికాంత్ కి మింగుడు పడని విషయం అతని కొడుకు హర్షవర్ధన్(మహేష్). హర్షకి తండ్రి పోకడ నచ్చదు. బిజినేస్ వ్యవహారాలంటే పడదు. తనకు నచ్చిన విధంగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటాడు. ఫ్యాక్టరీ వర్కర్స్ తో కలిసిపోతుంటాడు, వారికి కష్టాల్లో సహాయం చేస్తుంటాడు ఇది సింపుల్ గా చెప్పాలంటే హర్ష స్టయిల్ ఆఫ్ లివĹ#3135;ంగ్. అలాంటి హర్ష ఓ రోజు హాస్టల్ దగ్గర చారుశీల(శృతిహాసన్)ని చూసి ఇష్టపడతాడు. ఆమెతో పరిచయం పెంచుకోవడానికి ఆమె చదివే రూరల్ డెవలప్ మెంట్ కాలేజ్ లోనే జాయిన్ అవుతాడు. ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అలాంటి సందర్భంలో చారుశీలకి హర్ష, ధనవంతుడైన రవికాంత్ తనయుడని తెలుస్తుంది. అదే విషయాన్ని హర్షకి చెబుతుంది. దేవరకోట నుండి వచ్చిన రవికాంత్ కొడుకే హర్ష అని, ఊరిని పట్టించుకోవడం మానేసి వ్యాపారాలు చూసుకుంటున్నాడని చారుశీల హర్షని విమర్శిస్తుంది, ప్రేమించడం కుదరదని చెప్పేస్తుంది. అప్పుడు అసలు విషయం ఏంటో తెలుసుకుందామని దేవరకోటకి బయలుదేరుతాడు. ఆ గ్రామంలో సెంట్రల్ మినిష్టర్ వెంకట రమణ(ముకేష్ రుషి), అతని తమ్ముడు శశి(సంపత్), కొడుకు చేసే అగడాలతో దేవరకోటతో పాటు చుట్టుపక్కల పల్లెల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. తమ వ్యాపారాల కోసం వారు అడ్డు వచ్చిన వారిని చంపేస్తుంటారు. దేవరకోటకు వచ్చిన హర్ష అక్కడి పరిస్థితులు చూసి పల్లెను దత్తత తీసుకుని డెవలప్ చేస్తాడు. వెంకట రమణ, శశి అతని మనుషులను ఎదిరిస్తాడు. మరి వారేం చేస్తారు? హర్షకి ఎలాంటి సమస్యలు క్రియేట్ చేస్తారు? హర్ష ఏం చేస్తాడు? చారుశీల మళ్లీ హర్షను ప్రేమిస్తుందా? వారిద్దరూ ఒకటరవుతారా? అనేది తెలుసుకోవాలంటే సినిమాచూడాల్సిందే...

ప్లస్ పాయింట్స్

సినిమాని మహేష్ ఒన్ మ్యాన్ ఆర్మీలా ముందుకు నడిపించాడు. శ్రీమంతుడు అంటే మహేష్ అనేలా హ్యండ్ సమ్ గా కనపడుతూనే స్టయిలిష్ లుక్ లోకనపడ్డాడు. ఫైట్స్, డ్యాన్సుల్లో మంచి ఎనర్జీని చూపించాడు. డైలాగ్ డెలివరీ చేయడంలో, ఎమోషన్స్ తగిన విధంగా క్యారీ చేస్తూ సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లాడు. శృతిహాసన్ గ్లామర్ గా కనపడింది. తన పాత్రకు న్యాయం చేసింది. మహేష్, శృతి జోడి స్క్రీన్ పై చక్కగా ఉంది. సంపత్ తనదైన విలజాన్ని తెరపై చూపించాడు. నల్లేరు మీద నడకలా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇక మెయిన్ గా చెప్పుకోవాల్సింది జగపతిబాబు గురించి బిలియనీర్ పాత్రలో, మహేష్ తండ్రిగా తన రోల్ లో ఒదిగిపోయాడు. రిచ్ ఫాదర్ లా నటించే సన్నివేశాల్లో, క్లయిమాక్స్ లో కొడుకు గురించి తాపత్రయపడే తండ్రి పాత్రలో మెప్పించాడు. సుకన్య, సితార, తేజస్విని, ముకేష్ రుషి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. కొరటాల శివ ఓ యూనివర్సల్ పాయింట్ ను చక్కగా ప్రజెంట్ చేశాడని చెప్పాలి. స్టోరి ఫ్లో ఎక్కడా మిస్ కాకుండా చూసుకున్నాడు. మెయిన్ గా ప్రతి పాత్ర నుండి ఎమోషన్స్ చక్కగా రాబట్టాడు. మెసేజ్ ఇస్తూనే సినిమాని కమర్షియల్ పంథాలో ముందుకు నడిపాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సూపర్. ప్రతి ట్యూన్ బావుంది. అదే సాంగ్ ను తెరపై చూసేటప్పుడు ఇంకా అందంగా వినపడుతూ.. కనపడుతుంది. రాములవారిపై వచ్చే సాంగ్...,చారుశీల సాంగ్, మహేష్, శృతి మధ్య కాలేజ్ లో సాగే రొమాంటిక్ సాంగ్స్ చక్కగా ఉన్నాయి. జాగోరే.. పాట లిరిక్స్ బావున్నాయి. ఇక మది సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే ఒకే మాట ఎక్స్ ట్రార్డినరీ ప్రతి సీన్ చాలా ఫ్రెష్ గా, రిచ్ గా ఉండేలా చూశాడు. ఎడిటింగ్ బావుంది.

మైనస్ పాయింట్స్

పుట్టుకతోనే శ్రీమంతుడుగా ఉన్న వ్యక్తికి ఆ లైఫ్ స్టయిల్ అంటే ఎందుకు గిట్టదో సరిగా చూపెట్టలేకపోయారు. క్లయిమాక్స్ వీక్ గా అనిపించింది. సినిమా ఫస్టాఫ్ నెమ్మదిగా సాగుతున్నట్టుగా ఉండటమే కాకుండా సినిమాలో ఫస్టాఫ్ లో చెప్పదగ్గ పాయింట్ కనపడలేదు. నార్మల్ గా సాగిపోతుంది. ఆ విషయంలో కొరటాల శివ కేర్ తీసుకుని ఉండాల్సింది. అక్కడక్కడా డ్రాప్ అయినట్లే అనిపించింది.

విశ్లేషణ

మిర్చి లాంటి సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా అనగానే సూపర్ స్టార్ అభిమానులు అలాంటి మాస్ ఎంటర్ టైనర్ నే ఎక్స్ పెక్ట్ చేస్తారనడంలో డౌట్ లేదు. అయితే కొరటాల ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని దానికి మాస్ ఎలిమెంట్ ను జోడించి శ్రీమంతుడు చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే మిర్చి, శ్రీమంతుడు సినిమాల్లో కామన్ విషయం ఊరి బాగు హీరో తాపత్రయపడటం. ఫస్టాఫ్ ని అంతా అటు ఇటు తిప్పినట్లు అనిపించినా చెప్పాలనుకున్న పాయింట్ ను సెకండాఫ్ లో బలమైన ఎమోషన్స్ తో చెప్పడం చాలా ప్లస్ అయింది. దేవర కోటలో ముకేష్ రుషి అండ్ గ్యాంగ్ తో మహేష్ చేసే ఫైట్ సీక్వెన్స్ ఆడియెన్స్ కి నచ్చుతుంది. అదే సందర్భంలో దేవరకోట, ఊరి చివర మామిడితోపు వచ్చిన వాళ్లు తిరిగి వెళ్లరంటూ విలన్ చెప్పే డైలాగ్, దానికి హీరో చెప్పే సమాధానం ప్రేక్షకులకు నచ్చుతుంది. అలాగే విలన్స్ ఊళ్లో స్థలాన్ని కబ్జా చేస్తున్నప్పుడు అక్కడ సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతూనే మోహం పగలగొట్టేవారు లేరనుకున్నారా.. అంటూ విలన్ ని భయపెట్టే సీన్ ప్రేక్షకులకు నచ్చుతుంది. విలన్ ముకేష్ రుషి దగ్గరకి వెళ్లి బ్యాడ్ ఫాదర్, బ్యాడ్ సన్ గురించి చెప్పే సన్నివేశం కూడా నచ్చుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, మది సినిమాటోగ్రఫీ సినిమా వెన్నుదన్నుగా నిలిచాయి. సినిమా అంతా ఎమోషన్స్, సెంటిమెంట్ లతో నడిచి పోయిందే కానీ కామెడి పార్ట్ తక్కువై పోయింది. వెన్నెల కిషోర్, అలీ తమ స్టయిల్ ఆఫ్ కామెడితో నవ్వించారు.

బాటమ్ లైన్: శ్రీమంతుడు' - ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ విత్ మాస్ అప్పీల్

రేటింగ్: 3.5/5

English Version Review