శ్రీమంతుడు పై కాంట్రవర్సీ
- IndiaGlitz, [Friday,October 23 2015]
మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమంతుడు సినిమా రూపొందడం...ఈ సినిమా సంచలన విజయం సాధించడం తెలిసిన విషయమే. అయితే శ్రీమంతుడు సినిమా వచ్చి 80 రోజులు అవుతుంది. ఇప్పుడు శ్రీమంతుడు కథ నాదే..నాకు న్యాయం చేయడంటున్నాడు రచయిత శరత్ చంద్ర. ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రచయిత శరత్ చంద్ర మాట్లాడుతూ...2012లో ప్రచరురితమైన నా నవల చచ్చేంత్ర ప్రేమ స్వల్ప మార్పులతో శ్రీమంతుడు సినిమాగా రూపొందింది. నేను నా నవలను సినిమాగా తీయడానికి జయలక్ష్మి ఫిలింస్ వారికి ఇవ్వడం జరిగింది.
నారా రోహిత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో ఈ మూవీ రూపొందించడానికి ప్లాన్ చేసాం. సముద్ర గారికి జయలక్ష్మి ఫిలింస్ నిర్మాత మరియు సహ నిర్మాత వెళ్లి కథ చెప్పడం జరిగింది. హీరో డేట్స్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో శ్రీమంతుడు సినిమా రిలీజైంది.ఆ సమయంలో నేను కేరళలో ఉన్నాను. కొందరు మిత్రులు శ్రీమంతుడు సినిమా నేను రాసిన నవల ఆధారంగా రూపొందినట్టు ఉంది అని చెబితే చూసాను. ఈ సినిమాలో నవలకు సంబంధించిన పలు అంశాలు కలసినట్టు గమనించాను.
ఈలోపు జయలక్ష్మి ఫిలింస్ సంస్థ....నేను కొరటాల శివ గారికి స్ర్కిప్ట్ ఇచ్చానని అపార్ధం చేసుకుని నాకు లీగల్ నోటీసు ఇవ్వడం జరిగింది. నేను కొరటాల శివ గారిని సంప్రదించి..స్ర్కిప్ట్ కాపీ జరిగిందన్నాను. విచారణ కొరకు నిజ నిర్ధారణ కొరకు కమిటీ వేయమని కోరాను. రైటర్స్ అసోసియేషన్ లో కూడా ఫిర్యాదు చేసాను. నాకు, జయలక్ష్మి ఫిలింస్ సంస్థకు న్యాయం చేయవలసిందిగా సినిమా పెద్దలను అభ్యర్ధిస్తున్నాను అన్నారు. మరి శ్రీమంతుడు కథ నాదే అంటున్న శరత్ చంద్ర ఫిర్యాదు పై శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివ ఏమంటారో..? రైటర్స్ అసోసియేషన్ ఎలా స్పందిస్తుందో...? చూడాలి.