'శ్రీమంతుడు' చిత్రానికి సెన్సార్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్, శృతిహాసన్ జంటగా 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకుడుగా మైత్రి మూవీమేకర్స్ అండ్ ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సి.వి.ఎం) అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ క్యార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎటువంటి కట్స్ లేకుండా ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ని ఇచ్చారు.
ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సి.వి.ఎం) మాట్లాడుతూ - ''మా బేనర్‌లో సూపర్‌స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'శ్రీమంతుడు' చిత్రానికి సెన్సార్ పూర్తయింది. ఎటువంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ వారు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత చాలా మంచి సినిమా తీశారని సెన్సార్ సభ్యులు అభినందించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని రూపొందించారని దర్శకుడు కొరటాల శివను ప్రశంసించారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్ 7న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నాం. ఇప్పటికే ఈ చిత్రం ఆడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. దేవిశ్రీప్రసాద్ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. మొదటి చిత్రంగా మేం నిర్మించిన ఈ చిత్రం మా బేనర్‌లో మొదటి సూపర్‌హిట్ చిత్రంగా నిలుస్తుంది'' అన్నారు.
జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్ రుషి, సంపత్, హరీష్, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్: రాజుసుందరం, దినేష్, బాస్కో సీజర్, థ్రిల్స్: అనల్ అరసు, అసిస్టెంట్ డైరెక్టర్స్: త్రివేది, అసోసియేట్ డైరెక్టర్స్: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్: వాసు, తులసి, చీఫ్ కో డైరెక్టర్స్: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎ.యస్.ప్రకాష్, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సి.వి.ఎమ్), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout