శ్రీమాన్ దర్శకుడిగా కన్నడలో 'కుమారి 21ఎఫ్'
Send us your feedback to audioarticles@vaarta.com
రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించి నిర్మించిన చిత్రం 'కుమారి 21ఎఫ్. ఈ చిత్రం' తెలుగులో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో సెవెన్ ఛానల్ మాణిక్యం నారాయణన్, శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ సంయుక్తంగా కన్నడలో రీమేక్ చేస్తున్నారు. గత 9 సంవత్సరాలుగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ దర్శకత్వ శాఖలో మంచి అనుభవం సంపాదించిన శ్రీమాన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్ మహతి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్‌కుమార్ దగ్గర వర్క్ చేసి గుంటూర్ టాకీస్, ఒక మనసు చిత్రాలకు ఫోటోగ్రఫీ అందించిన రామిరెడ్డి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తారు. ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కథ, స్క్రీన్‌ప్లే: సుకుమార్, సమర్పణ: సుకుమార్ రైటింగ్స్, నిర్మాతలు: సెవెన్ ఛానల్ మాణిక్యం నారాయణన్, ఎ.ఎన్.బాలాజీ, దర్శకత్వం: శ్రీమాన్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments