Sreeleela: రవితేజ 'ధమాకా' నుండి శ్రీలీల బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" చిత్రాన్ని ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.
శ్రీలీల పుట్టినరోజు సందర్భంగాసరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ బర్త్ డే పోస్టర్ లో శ్రీలీల నుదుటిపై చేయి పెట్టుకుని క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో బ్యూటీఫుల్ గా వుంది. ఉబెర్-కూల్ కాస్ట్యూమ్‌లో ప్లజంట్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రణవి పాత్రలో అలరించనుంది శ్రీలీల.
‘డబుల్ ఇంపాక్ట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.
ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం 'ధమాకా' షూటింగ్ చివరి దశలో ఉంది.
తారాగణం: రవితేజ, శ్రీలీల
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com