శ్రీకాంత్ ఆవిష్కరించిన 'నీతోనే హాయ్ హాయ్' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
కేయస్ ప్రొడక్షన్స్ పతాకంపై డా.యలమంచిలి ప్రవీణ్ సమర్పణలో అరుణ్ తేజ్ , చరిష్మా శ్రీకర్ జంటగా బియన్ రెడ్డి అభినయ దర్శకత్వంలో డా.యలమంచిలి ప్రవీణ్, డా.ఏయస్ కీర్తి, డా.జి.పార్థ సారధి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'నీతోనే హాయ్ హాయ్'.ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ..."టైటిల్ చాలా హాయి హాయిగా ఉంది. వైద్య వృత్తిలో ఉంటూ సినిమా రంగం మీద ఇష్టంతో వచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతలకు అభినందనలు. సినిమా ఫీల్డ్ లో కష్టాలు, నష్టాలు ఉంటాయి. కానీ సిన్సియర్ గా కష్టపడితే మాత్రం కచ్చితంగా ఫలితం దక్కుతుంది. దర్శకుడు బియన్ రెడ్డి గారు దాసరి గారి లాంటి దర్శకుల వద్ద పని చేసిన అనుభవంతో ఈ సినిమాను అద్భతుంగా తెరకెక్కించారని టీజర్ చూస్తే తెలుస్తుంది. కొత్తవారైనా హీరో హీరోయిన్స్ చక్కటి నటన కనబరిచారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. కంటెంట్ బావుంటే కొత్త , పాత లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా విజయవంతం కావాలని కోరుకుంటూ యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు" అన్నారు.
జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ..."దాసరిగారి వద్ద పని చేస్తున్నప్పటి నుంచి దర్శకుడు బియన్ రెడ్డిగారితో పరిచయం ఉంది. అభినయ ఆర్ట్స్ ద్వారా ఎంతో మంది నూతన కళాకారులను ప్రోత్సహించేవారు. టైటిల్ ఎంత హాయి గా ఉందో సినిమా కూడా అంత హాయిగా ఉండబోతుందంటూ టీజర్ చూస్తే అర్థమవుతోంది. నటీనటులకు మంచి భవిష్యత్ ఉంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి హీరో శ్రీకాంత్ గారు వచ్చారు. విజయవంతంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సినిమా పూర్తైందన్నారు నిర్మాతలు.
ఆ సెంటిమెంట్ తో మళ్లీ శ్రీకాంత్ గారి చేతలు మీదుగా టీజర్ లాంచ్ జరిగితే శుభసూచకంగా ఉంటుందని అడగటంతో శ్రీకాంత్ గారిని సంప్రదించడం వారు కూడా పాజిటివ్ గా స్పందించి ఈ ఫంక్షన్ కు రావడం జరిగింది. చిన్న చిత్రాలను దాసరిగారు ప్రోత్సహించడంలో ముందుండే వారు . ఆ తర్వాత చిరంజీవి గారు ఆ స్థానాన్ని తీసుకున్నారు. 125 చిత్రాల్లో నటించి నటుడుగా తనకంటూ ఓ గొప్ప స్థానాన్ని ఏర్పరుచుకున్న శ్రీకాంత్ గారు కూడా చిన్న చిత్రాల దర్శక నిర్మాతలను ప్రోత్సహిస్తూ వారి కి ఎంతో భరోసా ఇవ్వడం అందరం అభినందించదగిన విషయం. ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నా" అన్నారు.
దర్శకుడు బియన్ రెడ్డి అభినయ మాట్లాడుతూ..."మార్చి 7న శ్రీకాంత్ గారి చేతుల మీదుగా మా సినిమా ప్రారంభమై విజయవంతంగా పూర్తైంది. వారిది లక్కీ హ్యాండ్. ఆ సెంటిమెంట్ తో శ్రీకాంత్ గారి చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేశాం.
నిర్మాతలు నన్ను , నా కథని నమ్మి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. పాటల షూటింగ్ కోసం వెళ్లినప్పుడు చిక్ మంగుళూరు లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి షూటింగ్ కంప్లీట్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందన్నారు.
నటుడు బెనర్జి మాట్లాడుతూ..."కథని నమ్మి ఎంతో పాషనేట్ తో నిర్మాతలు ఈ సినిమా తీసారు. దర్శకుడు చెప్పిన దానికన్నా అద్భుతంగా తెరకెక్కించారు. అనుకున్న షెడ్యూల్ కన్నా ముందే సినిమా పూర్తి చేసి నిర్మాతల దర్శకుడు అనిపించుకున్నారు బియన్ రెడ్డిగారు" అన్నారు.
హీరోయిన్ మాట్లాడుతూ..."ఇంత మంచి సినిమాలో నేనూ పార్ట్ అవడం హ్యాపీగా ఉందన్నారు".
హీరో అరుణ్ తేజ్ మాట్లాడుతూ..."ఎంతో హాయిగా షూటింగ్ జరిగింది. ఎంతో ఫాస్ట్ గా అనుకున్న దానికన్నా ముందే సినిమా చేశారు దర్శకుడు. అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా సినిమా ఉంటుందన్నారు".
నిర్మాత డా.పార్థసారధి రెడ్డి మాట్లాడుతూ..."ఎన్నో వ్యయ ప్రయాలసకోర్చి సినిమా చేశాం. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా" అన్నారు.
డా.ఏయస్ కీర్తి మాట్లాడుతూ..."సినీ రంగంలో ఎంతో అనుభవం ఉన్న బియన్ రెడ్డి గారు అన్నీ తానై ఈ సినిమా చేశారు. ఒక డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టమో ఒక సినిమా తీయాలన్నా దాదాపు అంతే కష్టమని ఈ సినిమా చేశాక అర్ధమైంది. సినిమా అనుకున్న విధంగా తీసాం" అన్నారు.
సమర్పకులు డా. యలమంచిలి ప్రవీణ్ మాట్లాడుతూ..."ఎంతో పాషన్ తో ఈ సినిమా చేశాం. అంతే పాషన్ తో ఉన్న దర్శకుడు ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేశారు" అన్నారు.
ఆనంద్, బెనర్జి, నారాయణరావు, ఏడిద శ్రీరామ్, జయచంద్ర, జబర్దస్త్ రాంప్రసాద్, శ్రీ ప్రియ, శిరీష, కృష్ణ ప్రియ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరాః ఈదర ప్రసాద్, సంగీతంః రవి కళ్యాణ్; కొరియోగ్రఫీః సాయి రాజ్; ఫైట్స్ః రవి; కో-డైరక్టర్ః పి.నవీన్; పీఆర్వోః బాక్సాఫీస్ మీడియా (చందు రమేష్); ప్రొడక్షణ్ ఎగ్జిక్యూటివ్ః మట్టా కృష్ణారెడ్డి; నిర్మాతలుః డా.యలమంచిలి ప్రవీణ్; డా.ఏయస్ కీర్తి; డా. జి. పార్థసారధి రెడ్డి; స్టోరి-డైలాగ్స్- స్క్రీన్ ప్లే-డైరక్షన్ః బియన్ రెడ్డి అభినయ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout