close
Choose your channels

తనయుడితో తొలిసారి..

Tuesday, December 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తనయుడితో తొలిసారి..

తెలుగు సినీ రంగంలో హీరోగా శ్రీకాంత్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే అంత కంటే ముందే అంటే కెరీర్‌ ప్రారంభంలో శ్రీకాంత్‌ విలన్‌గా కూడా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. తర్వాత హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తూ వస్తున్నాడు. ఈయన కుటుంబం నుండి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆయన తనయుడు రోషన్‌. నిర్మలా కాన్వెంట్‌ సినిమాలో రోషన్‌ తొలిసారి హీరోగా నటించినా.. తనకు అది రోషన్‌కి మంచి గుర్తింపునివ్వలేదు. చాలా గ్యాప్‌ తర్వాత హీరోగా మళ్లీ రోషన్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు.

తండ్రి శ్రీకాంత్‌కు బ్రేక్‌ ఇచ్చిన సినిమాల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడి ఒకటి. చిన్న బడ్జెట్‌ సినిమాగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ మూవీగా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఇప్పుడు అదే టైటిల్‌ 'పెళ్లి సందD'లో శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌ హీరోగా నటిస్తున్నాడు. దర్శకేంద్రుడి దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరి ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు.

తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్‌ కూడా నటిస్తున్నాడట. కథను మలుపు తిప్పే పాత్రలో శ్రీకాంత్‌ కనపడతాడని వార్తలు వినిపిస్తున్నాయి. తొలిసారి తండ్రి కొడుకులు తెరపై కనిపించే చిత్రం కూడా ఇదే అవుతుంది. ప్రస్తుతం సినిమాకు స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. ప్రీ ప్రొడక్షన్‌లో భాగంగా హీరోయిన్‌ ఎవరనే దానిపై అన్వేషణ జరుగుతుంది. త్వరలోనే హీరోయిన్‌ విషయంపై ఓ క్లారిటీ రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment