అప్పుడు చెర్రీతో..ఇప్పుడు బన్నితో..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే` చిత్రంలో చరణ్ కి బాబాయ్ బంగారిగా నటించిన సీనియర్ హీరో శ్రీకాంత్ త్వరలో మెగా క్యాంప్ హీరో స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్, బోయపాటి చిత్రంలో కీలకపాత్రలో కనిపిస్తాడట. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.
ఈ చిత్రంలో ఆదిపినిశెట్టి విలన్ గా కనిపిస్తాడట. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం చెర్రీతో హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ బన్ని సినిమాలో నటిస్తుండగా, గతంలో నటించిన శ్రీకాంత్ కూడా ఈ చిత్రంలో యాడ్ కావడం యాదృచ్చికమైనా భారీ తారాగణం చేరికతో సినిమాపై అంచనాలు పెరుగుతాయనడంలో డౌట్ లేదు...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments