Kotabommali PS:మలయాళ సూపర్‌హిట్ మూవీ రీమేక్‌లో శ్రీకాంత్ : రాజకీయ నాయకులు, పోలీసుల మధ్య సంఘర్షణగా ‘‘కోట బొమ్మాళి పీఎస్ 2’’
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో వున్న విలక్షణ నటుల్లో శ్రీకాంత్ ఒకరు. విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను మెప్పించారు. లవ్, రోమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, జానపదం, పౌరాణికం, క్రైమ్ ఇలా అన్ని జోనర్లలో నటించిన అరుదైన నటుల్లో ఒకరిగా శ్రీకాంత్ ఘనత వహంచారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీకాంత్ తెలుగులో ఈ తరం నటుల్లో 100 సినిమాలు పూర్తి చేసిన వ్యక్తిగా నిలిచారు. వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, కన్యాదానం, మా నాన్నకి పెళ్లి, ప్రయేసి రావి, పెళ్లి సందడి, ఖడ్గం వంటి సినిమాలు ఆయన నటనకు తార్కాణం. కెరీర్లో ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకుని నేటికీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు శ్రీకాంత్.
అల్లు అరవింద్‌ను ఆకట్టుకున్న నాయట్టు :
చాలా రోజుల తర్వాత శ్రీకాంత్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. అది కూడా గీతా ఆర్ట్స్ నుంచి. వివరాల్లోకి వెళితే.. మలయాళంలో సూపర్‌హిట్ అయిన ‘‘నాయట్టు’’ రీమేక్ కావడం విశేషం. రెండేళ్ల కిందటే ఈ సినిమాను చూసిన నిర్మాత అల్లు అరవింద్‌కు బాగా నచ్చడంతో ఈ చిత్ర తెలుగు రైట్స్‌ను కొనుగోలు చేశారు. తొలుత డబ్బింగ్ చేసి తన ఓటీటీ సంస్థ ‘‘ఆహా’’లో స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. కానీ కథ, కథనాల పరంగా అద్భుతమైన సినిమా అయ్యే అవకాశాలు నూటికి నూరు శాతం వుండటంతో ఆయన ఆలోచనను విరమించుకున్నారు. భారీ స్టార్ క్యాస్టింగ్‌తో రిచ్‌గా సినిమా తీయాలనుకున్నారు. అది కూడా సెట్ కాకపోవడంతో శ్రీకాంత్‌ను లీడ్ రోల్లో పెట్టి సినిమా తీశారు.
ఆసక్తికరంగా పోస్టర్ :
జోహార్, అర్జున ఫల్గుణ చిత్రాలను డైరెక్ట్ చేసిన తేజ మార్ని ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి కోటబొమ్మాళి పీఎస్ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. పోస్టర్లో భారత రాజముద్ర మూడు సింహాల గుర్తును ఇనుప సంకెళ్లతో బంధించి.. ఎన్నికల బ్యాలెట్ పేపర్ తగలబడుతున్నట్లుగా చూపించారు. ఆ పేపర్‌పై శ్రీకాంత్, విజయ్, శివాని పరిగెడుతున్నట్లు చూపించారు. తద్వారా పోస్టర్‌తోనే సినిమాపై హైప్ తీసుకొచ్చింది మూవీ యూనిట్. తమకు సంబంధం లేని హత్య కేసులో ముగ్గురు పోలీసు అధికారులు ఎందుకు చిక్కుకుంటారు. ఈ కేసు నుంచి వాళ్లు బయటపడతారా లేదా..? అన్నదే కథ. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాసు ‘‘కోట బొమ్మాళి పీఎస్’’ను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments