రోష‌న్ నెక్ట్స్ మూవీ ఎక్స్ క్లూజివ్ డీటైల్స్..!

  • IndiaGlitz, [Friday,September 16 2016]

శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ..రూపొందిన యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ నిర్మ‌లా కాన్వెంట్. ఈ చిత్రాన్ని జి.నాగ‌కోటేశ్వ‌ర‌రావు తెర‌కెక్కించారు. ఈరోజు రిలీజైన నిర్మలా కాన్వెంట్ చిత్రానికి పాజిటివ్ టాక్ వ‌స్తుంది. ముఖ్యంగా శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ కొత్త‌వాడైన‌ప్ప‌టికీ చాలా బాగా న‌టించాడు అంటూ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే...రోష‌న్ ఇక సినిమాలకు గ్యాప్ ఇచ్చి 3 సంవ‌త్స‌రాలు విదేశాల్లో ఏక్టింగ్ కోర్స్ చేయ‌నున్నాడు. ఈ కోర్స్ పూర్తి చేసిన త‌ర్వాత అప్పుడు ఫుల్ ప్లెడ్జెడ్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. 3 సంవ‌త్స‌రాల త‌ర్వాత రోష‌న్ ఫుల్ ఫ్లెడ్జెడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే సినిమాను కూడా అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జునే నిర్మించ‌నున్నారు.