సెప్టెంబర్ నెలాఖరున శ్రీకాంత్ 'ఆపరేషన్ 2019'
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీకాంత్ కథానాయకుడిగా అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి అలివేలు నిర్మిస్తున్న సినిమా ‘ఆపరేషన్ 2019’. బివేర్ ఆఫ్ పబ్లిక్... అనేది ఉపశీర్షిక. కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్‌కుమార్, సునీల్ 'కీ రోల్స్' (కీలక పాత్రలు) చేస్తున్నారు.
ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. సెన్సార్ పూర్తికాగానే విడుదల తేదీ ప్రకటించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.... ర్యాప్రాక్ షకీల్ స్వరపరిచిన ఓ పాటను సునీల్‌పై తెరకెక్కిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.ఈ సందర్భంగా లొకేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ "ఇంతకు ముందు కరణం బాబ్జి దర్శకత్వంలో 'మెంటల్ పోలీస్' అనే సినిమా చేశా. రాజకీయ నేపథ్యంలో తాజా 'ఆపరేషన్ 2019' అనే సినిమా చేస్తున్నా. ఈ నెలాఖరున సినిమా విడుదల కానుంది. చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. 'ఆపరేషన్ దుర్యోధన' తర్వాత మళ్లీ ఒక గెటప్‌తో కొత్త సినిమా చేశాననే ఫీలింగ్ కలిగింది.
ప్రేక్షకులు ఆలోచించే విధంగా కరణం బాబ్జి డైలాగులను బాగా రాశాడు. నిర్మాతల సహకారంతో అనుకున్న విధంగా చిత్రీకరణ జరిగింది. ఇందులో మంచు మనోజ్, సునీల్‌గారితో స్ర్కీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సునీత్‌తో నా కాంబినేషన్లో మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతో మా కాంబినేషన్ వస్తుంది. ఎన్నికలు దగ్గర పడటంతో ప్రజలు ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది చూస్తారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్తగా ఉంటుందని అనుకుంటున్నా" అన్నారు.
సునీల్ మాట్లాడుతూ "శ్రీకాంత్ అన్నయ్య నటించిన 'ఆపరేషన్ దుర్యోధన'నా ఫేవరేట్ సినిమా. పోసాని కృష్ణమురళిగారు ఎప్పుడు సెట్లో కనిపించినా నేను ఆ సినిమా గురించే మాట్లాడుతుంటాను. నాకు అంత ఇష్టం. ఇప్పుడు 'ఆపరేషన్ 2019' పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో నటించడం నాకిష్టం.
2019లో ఎలా ఉండాలనుకుంటున్నామనేది ఈ సినిమా ద్వారా 2018లో తెలియజేస్తున్నామని శ్రీకాంత్ అన్నయ్య నాతో చెప్పారు. నేను ఈ సినిమాలో వచ్చే సందర్భం అందరికీ షాకింక్‌గా ఉంటుంది. తమ్ముడు మనోజ్‌తో కలిసి కీలక పాత్ర చేయడం సంతోషంగా ఉంది. ఇందులో ఒక సాంగ్ చేస్తున్నా. చాలా రోజుల తర్వాత నేను డ్యాన్స్ చేసే అవకాశం కల్పించిన శ్రీకాంత్ అన్నయ్యకి, దర్శకుడు బాబ్జిగారికి థ్యాంక్స్" అన్నారు.
దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ "శ్రీకాంత్‌గారితో నాకిది రెండో సినిమా. చెన్నైలో జరిగిన ఒక ఘటన ఆధారంగా నేను ఈ సినిమా స్టార్ట్ చేశా. సునీల్‌గారు కథ విన్న వెంటనే అంగీకరించారు. మనోజ్గారు కథ వినగానే ‘‘పెదరాయుడు’లో రజనీకాంత్‌గారి పాత్రలా ఉంది. సూపర్. నేను చేస్తున్నా’’ అని వెంటనే అంగీకరించారు. ‘ఆపరేషన్ దురోధ్యన’ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో కనబడుతుంది" అన్నారు.
యజ్ఞ శెట్టి, దీక్షా పంత్, హరితేజ, సుమన్, కోట శ్రీనివాసరావు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు , కెమెరా: వెంకట్ ప్రసాద్, కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, భాషాశ్రీ, సంగీతం: ర్యాప్రాక్ షకీల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com