కళా తపస్విని సత్కరించి, అభినందనలు తెలిపిన హీరో శ్రీకాంత్
Thursday, May 11, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కళా తపస్వి కె. విశ్వనాథ్ ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇప్పటికే ఆయన్ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా `మా` ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ కూడా ఎంపీ మురళీ మోహన్ సమక్షంలో విశ్వనాథ్ స్వగృహంలో కలిసారు. అనంతరం మురళీ మోహన్, `మా` అధ్యక్షుడు శివాజీరాజా, శ్రీకాంత్ ఆయన్ను సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, ` షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల విశ్వనాధ్ గారిని కలవడం ఆలస్యమైంది. నిన్ననే ఆయన్ను కలిసాను. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు. వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, ఈసీ మెంబర్ సురేష్ కొండేటి సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments