మా అబ్బాయి రోషన్ నాకంటే మంచి స్ధాయికి వెళతాడు అనేది నా నమ్మకం - శ్రీకాంత్
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీకాంత్ - ఊహల ముద్దుల తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం నిర్మలా కాన్వెంట్. ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రాన్ని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి.నాగ కోటేశ్వరరావు తెరకెక్కించారు. ఈనెల 16న నిర్మలా కాన్వెంట్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...మా అబ్బాయి రోషన్ ని అప్పుడే హీరోగా పరిచయం చేయాలి అనుకోలేదు. రుద్రమదేవి సినిమాలో రానా చిన్నప్పటి క్యారెక్టర్ గురించి అడిగితే ఓకే అన్నాం. రుద్రమదేవి తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ వద్దనుకున్నాం. అనుకోకుండా ఈ సినిమా ఆఫర్ వచ్చింది. కథ చాలా బాగుంది. పైగా నిర్మాతలు నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ గారు అని తెలియడంతో రోషన్ ని అడిగితే చేస్తాను అనడంతో అప్పుడు ఓకే చెప్పాం. ఈ సినిమా చూసిన తర్వాత ఓకే చెప్పకపోయుంటే మంచి ఆఫర్ మిస్ అయ్యే వాళ్లం అనిపిస్తుంది. రోషన్ ఎలా చేస్తున్నాడో అని ఫస్ట్ డే షూటింగ్ కి వెళ్లాను టెన్షన్ లేకుండా చేస్తుండడం చూసి నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ టీమ్ అందరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. నాగార్జున గారి సినిమాలో నేను విలన్ గా నటిస్తే, మా అబ్బాయి నాగార్జున గారి సినిమాలో హీరోగా నటించడం చాలా సంతోషంగా ఉంది. నా కంటే మంచి స్ధాయికి వెళతాడని నా నమ్మకం అన్నారు.
శ్రీమతి ఊహ మాట్లాడుతూ...నాగార్జున గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు నిర్మించిన నిర్మలా కాన్వెంట్ చిత్రంలో రోషన్ కి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. టీజర్ లో రోషన్ ని చూసినప్పుడు, అలాగే ఆడియో ఫంక్షన్ లో రోషన్ స్పిచ్ విన్నప్పుడు ఆనందంతో కళ్లంట నీళ్లు వచ్చేసాయి. అంత బాగా మాట్లాడతాడు అని మేము అసలు అనుకోలేదు. అలాగే సెంటిమెంట్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించాడు. మీ అందరి ఆశీస్సులు రోషన్ కి ఉండాలి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో రోషన్ మాట్లాడుతూ...ఎమోషన్ సీన్స్ చేసేటప్పుడు ఎలా చేయాలి అని అమ్మనాన్నను అడిగాను. వేరే విషయాల గురించి ఆలోచించకుండా...ఏ సీన్ అయితే చేయాలో అది నీకు నిజంగా జరిగితే నువ్వు ఏం చేస్తావో అది చేయ్ అని చెప్పారు. అమ్మనాన్న ఇచ్చిన సలహాలు తీసుకుని నటించాను. ఫస్ట్ మూడు రోజులు సాంగ్ తో షూటింగ్ స్టార్ట్ చేసారు. మొదట్లో కాస్త కొత్తగా అనిపించినా తర్వాత అలవాటైపోయింది. ఫస్ట్ క్రికెటర్ అవ్వాలి అనుకున్నా...రుద్రమదేవి సినిమా చేసినప్పటి నుంచి ఏక్టర్ అవ్వాలి అనిపించింది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout