శ్రీకాంత్, అల్లరి నరేష్ లు అభినందించిన వశం
Send us your feedback to audioarticles@vaarta.com
వాసుదేవరావు - శ్వేతా వర్మ జంటగా చల్లా శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వశం. సినిమా రంగం పై మక్కువ కలిగిన పలువురు యువతీయువకులు తలా కొంత డబ్బులు వేసుకొని నిర్మించిన చిత్రం ఈ వశం. ఈనెల 4న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వశం పోస్టర్ లను ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు హీరోలు శ్రీకాంత్ , అల్లరి నరేష్ లు .
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చల్లా శ్రీకాంత్ మాట్లాడుతూ," హీరోలు శ్రీకాంత్ , అల్లరి నరేష్ లు మా చిత్రం విజయం సాధించాలని శుభాకాంక్షలు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక కథ విషయానికి వస్తే....... ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేసే పవర్ మనకు వస్తే ,వాళ్ళని వశపరుచుకోగలిగితే ఏం జరుగుతుంది అన్నదే మా వశం చిత్ర కథ . ప్రపంచంలో ప్రతీది కొత్తగా కనిపెట్టినప్పుడు ఈ ప్రపంచం నమ్మలేదు కానీ కాలక్రమేణా నమ్మాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు కూడా నేను చెప్పేది భవిష్యత్ లో నమ్మాల్సి వస్తుందేమో అని అన్నారు. ఆగస్ట్ 4న రిలీజ్ అవుతున్న వశం చిత్రం పై ఆ చిత్ర బృందం ఎన్నో ఆశలు పెట్టుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com