శ్రీకాంత్ అడ్డాల మరో యూత్‌ఫుల్ మూవీ

  • IndiaGlitz, [Thursday,March 29 2018]

‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’ చిత్రాల కోసం సహాయ ద‌ర్శ‌కుడిగా పనిచేసిన శ్రీకాంత్ అడ్డాల పని తీరు నచ్చి.. దిల్ రాజు ద‌ర్శ‌కుడిగా ఓ అవకాశం ఇచ్చారు. అలా.. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించారు శ్రీకాంత్. ఆ తర్వాత మళ్ళీ దిల్ రాజు నిర్మాణంలోనే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ పేరుతో ఓ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించి తన స్థాయిని మరింత పెంచుకున్నారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.

అయితే.. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన ‘ముకుంద’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని అందివ్వలేకపోయాయి. దీంతో కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ దర్శకుడు..  మరోసారి యూత్‌ఫుల్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం. ఈ చిత్రంలో.. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న యువ కథానాయకుడు నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే.. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోందని కూడా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ చిత్రంతో పూర్వ వైభవాన్ని సంపాదిస్తానని అంటున్నారు శ్రీకాంత్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి క్లారిటీ రానుంది.

More News

వరుణ్ తేజ్ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటంటే..

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి  కాంబినేష‌న్‌లో ఓ సినిమా  తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే.

అంగరంగ వైభవంగా ఎన్టీయార్ ప్రారంభోత్సవం

ప్రతి తెలుగువాడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం "ఎన్టీయార్" బయోపిక్.

ఎన్టీఆర్ సినిమాలో జగపతి బాబు పాత్ర ఇదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ పూజా హెగ్డే జంటగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగ‌తి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

రంగస్థలంకి ఇంటర్వెల్ బాంగ్ హైలైట్ అట‌

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది.

యంగ్ హీరోతో సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్?

భిన్నమైన కథలతో.. వైవిధ్యమైన కథనంతో సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట ద‌ర్శ‌కుడు సుకుమార్.