శ్రీకాంత్ అడ్డాల మరో యూత్‌ఫుల్ మూవీ
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’ చిత్రాల కోసం సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీకాంత్ అడ్డాల పని తీరు నచ్చి.. దిల్ రాజు దర్శకుడిగా ఓ అవకాశం ఇచ్చారు. అలా.. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించారు శ్రీకాంత్. ఆ తర్వాత మళ్ళీ దిల్ రాజు నిర్మాణంలోనే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ పేరుతో ఓ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించి తన స్థాయిని మరింత పెంచుకున్నారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.
అయితే.. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన ‘ముకుంద’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని అందివ్వలేకపోయాయి. దీంతో కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ దర్శకుడు.. మరోసారి యూత్‌ఫుల్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం. ఈ చిత్రంలో.. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న యువ కథానాయకుడు నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే.. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోందని కూడా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ చిత్రంతో పూర్వ వైభవాన్ని సంపాదిస్తానని అంటున్నారు శ్రీకాంత్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com