ప్రముఖ నిర్మాతతో శ్రీకాంత్ అడ్డాల?
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్త బంగారు లోకం వంటి విజయవంతమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీకాంత్ అడ్డాల. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్‌బాబు, విక్టరీ వెంకటేష్‌లతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెరకెక్కించాడు. మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అయితే ఆ తరవాత వచ్చిన ముకుందగానీ.. మహేష్‌బాబు కాంబినేషన్‌లో మరోసారి చేసిన బ్రహ్మోత్సవం గానీ ఆయన కెరీర్ కి ఏ మాత్రం ఉపయోగపడలేదు.
బ్రహ్సోత్సవం విడుదలై ఒకటిన్నర సంవత్సరం పూర్తయినా.. శ్రీకాంత్ నుంచి మరో చిత్రం రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. శ్రీకాంత్ తదుపరి చిత్రంకి రంగం సిద్ధమైందని తెలిసింది. ఆరు నెలలుగా ఓ స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్న శ్రీకాంత్.. అది పూర్తయ్యాక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ని కలిసారని.. కథ నచ్చడంతో శ్రీకాంత్‌తో సినిమా చేసేందుకు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. కాగా, ఈ సినిమాని కొత్త బంగారు లోకం తరహాలో యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కించే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com