మరో బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ శ్రీకాంత్ అడ్డాల చేతికి?
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సెన్సిబుల్ కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు శ్రీకాంత్ అడ్డాల. శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా అసురన్ రీమేక్ నారప్ప తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
అసురన్ శ్రీకాంత్ అడ్డాల శైలికి దూరంగా ఉండే కథ. అలాంటి ఆ చిత్ర రీమేక్ తెరకెక్కిస్తుండడంతో ఆసక్తి నెలకొంది. దాదాపుగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. కరోనా తీవ్రత తగ్గాక నారప్ప విడుదలపై క్లారిటీ రానుంది. ఇదిలా ఉండగా ఇంతలోనే శ్రీకాంత్ అడ్డాల మరో సూపర్ హిట్ మూవీ రీమేక్ ఛాన్స్ అందుకున్నట్లు టాక్.
ఇది కూడా ధనుష్ నటించిన చిత్రమే. రీసెంట్ తమిళనాడులో విడుదలైన కర్ణన్ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఓటిటిలో కూడా అద్భుతమైన స్పందన అందుకుంటోంది. ఈ చిత్ర రీమేక్ హక్కులని బెల్లంకొండ శ్రీనివాస్ దక్కించుకున్నారు.
కర్ణన్ రీమేక్ తెరకెక్కించే బాధ్యతని కూడా శ్రీకాంత్ అడ్డాలకే అప్పగించారట. ఎలాగూ అసురన్ రీమేక్ తెరకెక్కించిన అనుభవం శ్రీకాంత్ కి ఉంది కాబట్టి కర్ణన్ ని కూడా సమర్థవంతంగా తెరకెక్కిస్తారని బెల్లంకొండ కాంపౌడ్ అతడిపై నమ్మకం ఉంచింది.
ఎలాగైనా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేయాలని బెల్లంకొండ శ్రీనివాస్ గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు.అందుకే రీమేక్ కథలు ఎంచుకుంటున్నాడు. శ్రీకాంత్ అడ్డాల మాత్రం నారప్ప తర్వాతే కర్ణన్ పై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com