Srikanth Addala:మాస్ కథతో శ్రీకాంత్ అడ్డాల .. పేరు ‘‘పెద్ద కాపు’’, రక్తం మరకలతో ఆ చేతుల వెనుక కథేంటీ..?

  • IndiaGlitz, [Tuesday,May 30 2023]

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు వంటి అంశాల చుట్టూ సినిమాలు తీయడంలో మంచి పేరు తెచ్చుకున్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన తీసిన కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు, బ్రహ్మోత్సవం, నారప్ప వంటి చిత్రాలతో విభిన్న చిత్రాల దర్శకుడిగా ఆయన గుర్తింపు సొంతం చేసుకున్నారు. విక్టరీ వెంకటేశ్‌తో చేసిన నారప్ప తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయడానికి శ్రీకాంత్ కాస్తంత టైమ్ తీసుకున్నారు. ఈసారి సాలిడ్ హిట్‌తో తన సత్తా ఏంటో చూపించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి మాస్ కథతో వస్తున్నారు శ్రీకాంత్.

అఖండ తర్వాత మిర్యాల రవీందర్ రెడ్డి సినిమా :

బోయపాటి శ్రీనుతో జయ జానకీ నాయక, అఖండ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో శ్రీకాంత్ ఈ సినిమా చేస్తున్నారు. ఈ కాంబో నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. జూన్ 2న టైటిల్ , ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. తాజా పోస్టర్‌లో రక్తం మరకలతో వున్న చేతిని చూడొచ్చు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అఖండ ద్వారా ద్వారకా క్రియేషన్స్ భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నేపథ్యంలో తాజా చిత్రంపైనా భారీ అంచనాలు అంచనాలు వున్నాయి. దీనికి ‘‘పెద్ద కాపు’’ అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి బావమరిది హీరోగా నటించనున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

కోనసీమ బ్యాక‌డ్రాప్‌లో స్టోరీ :

1980వ దశకంలో కోనసీమ ప్రాంతంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా పెద్ద కాపును తెరకెక్కిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఆ సమయంలో అక్కడ ముఠా కక్షలు, వర్గపోరు, కులాల కుమ్ములాట వంటివి ఎక్కువగా చోటు చేసుకున్నాయని చెబుతారు. దీనికి పొలిటికల్ టచ్ ఇచ్చేలా శ్రీకాంత్ అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆయన వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాల్సిందే.

More News

Kodali Nani:ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద అభిమానుల ఓవరాక్షన్ .. తారక్ ప్లేస్‌లో నేనుంటేనా : కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు నిన్న తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా

Nagababu:మీ ప్రోత్సాహం మరువలేనిది.. ఇదే స్పూర్తితో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం : ఎన్ఆర్ఐలతో నాగబాబు

జనసేన పార్టీ బలోపేతం కోసం విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు అందిస్తున్న సహకారం ఎన్నటికీ మరువలేనిదన్నారు

GSLV F12 NVS 01 : జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 ప్రయోగం విజయవంతం.. ఇస్రో శాస్త్రవేత్తలకు పవన్ కల్యాణ్ అభినందనలు

జీఎస్ఎల్‌వీ ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం సక్సెస్ కావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

Director Teja : ఆంధ్రా వాళ్లకి సిగ్గులేదు .. డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు

దర్శకుడు తేజ.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రామ్‌గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన ఆయన తనదైన మార్క్ చూపించారు.

ISRO : జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 ప్రయోగం విజయవంతం... ఈ శాటిలైట్ వల్ల ఉపయోగాలివే

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో దూసుకుపోతోంది.