'గీత' లో అడ్డాల - నాని?
Send us your feedback to audioarticles@vaarta.com
గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే సినిమాలో అడ్డాల శ్రీకాంత్, నాని కలిసి పనిచేయబోతున్నారా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. గత కొంతకాలంగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్న శ్రీకాంత్ అడ్డాల ఇటీవల నానికి స్క్రిప్ట్ వినిపించారట. ఆల్రెడీ 'జర్సీ' సినిమా ఇచ్చిన కిక్ మీదున్నారు నాని.
శ్రీకాంత్ అడ్డాల చెప్పిన సింపుల్ టౌన్ బేస్డ్ స్క్రిప్ట్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అయితే ఈ విషయం గురించి ఇప్పటిదాకా అటు నాని కానీ, ఇటు అడ్డాల శ్రీకాంత్గానీ, అటు గీతా ఆర్ట్స్ గానీ ఏమీ చెప్పలేదు.
నాని ప్రస్తుతం 'గ్యాంగ్‌లీడర్' సినిమాతో బిజీగా ఉన్నారు. గీతా ఆర్ట్స్ లో వరుస చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. అడ్డాల శ్రీకాంత్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com