'అమ్మాయిలంతే..అదో టైపు' ట్రైలర్ ఆవిష్కరించిన శ్రీకాంత్ అడ్డాల
Send us your feedback to audioarticles@vaarta.com
"ఇటీవలి కాలంలో బంధాలు అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ కోవలోనే ఆకట్టుకోబుతున్న మరో ఆసక్తికర చిత్రమిది. తండ్రి -తనయల అనుబంధం నేపథ్యంలో ఉద్వేగభరితమైన కంటెంట్ తో తీస్తున్న చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తి రేకెత్తించింది. పెద్ద విజయం సాధిస్తుంది`` అన్నారు శ్రీకాంత్ అడ్డాల. గాళ్స్‌లో ఎమోషన్స్ బేస్ చేసుకుని, తండ్రి - తనయల బాంధవ్యంపై తెరకెక్కిస్తున్న సినిమా `అమ్మాయిలంతే .. అదో టైపు`. కృష్ణమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గోపి వర్మ, మాళవిక మీనన్, శివాజీ రాజా ప్రధాన తారాగణం. గాయత్రి రీల్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ట్రైలర్ ఆవిష్కరించిన అనంతరం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
దర్శకనిర్మాతలు మాట్లాడుతూ - "ఓ తొందరపాటు నిర్ణయం తండ్రి -కూతుళ్ల మధ్య దూరం ఎలా పెంచింది? తండ్రి ప్రేమకు దూరమైన కూతురు అనుభవించే బాధ, ఆ క్రమంలో సంఘటనల సమాహారమే ఈ చిత్రం. సీనియర్ నటులు శివాజీ రాజా కీలక పాత్ర పోషించారు. ఓ బాధ్యతాయుతమైన తండ్రి గా ఆయన నటన ఆకట్టుకుంటుంది. నవతరం నటీనటుల పెర్ఫామెన్స్ మెప్పిస్తుంది. భావోద్వేగాలతో సాగే ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్ ని ఆకట్టుకుంటుంది. చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమాని రిలీజ్ చేస్తున్నాం" అన్నారు.
గోపి వర్మ, మాళవిక మీనన్, శివాజీ రాజా, సాయి, భద్రమ్, వేణుగోపాల్, భరత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః శ్రీనివాస్, కూర్పు: గోపి సిందమ్, సాహిత్యంః పూర్ణాచారి, దర్శకత్వంః కృష్ణమ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com