కొడుకు సినిమా గురించి చెప్పిన శ్రీకాంత్‌

  • IndiaGlitz, [Sunday,September 09 2018]

శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ తొలి సినిమా నిర్మలా కాన్వెంట్‌. ఆ సినిమా అనుకున్న స్థాయిలో పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. త‌ర్వాత శ్రీకాంత్ ఏదో తొంద‌ర ప‌డి రోష‌న్‌తో సినిమాలు చేయించ‌కుండా ఎడ్యుకేష‌న్‌పై ఫోక‌స్ చేయించాడు. ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోంద‌ట‌. హార‌ర్ కామెడీ కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌. ప్యాష‌న్ సినిమా బ్యాన‌ర్‌పై ఉమేష్, సుధ‌న్‌, జ‌య‌రామ‌న్‌లు నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా వివ‌రాల‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.