మీ లైక్స్ కోసం ఇలా చేయకండి: శ్రీకాంత్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల సోషల్ మీడియా లో కొంతమంది చేస్తున్న అకృత్యాలను చూస్తుంటే మీడియా పైనే విసుగుపుట్టేలా అనిపించడం ఖాయం.. వారి వీడియోలకు లైకులు రావడం కోసం, వ్యూస్ పెరగడం కోసం కొన్ని సంస్థలు చేస్తున్న తీరు ఆడియోన్స్ నే కాదు సెలెబ్రెటీలను సైతం చిరాకు తెప్పిస్తోంది.. గాసిప్స్ అంటే కొంత తెలిసి మరికొంత తెలియని విషయాన్ని ఆరోగ్యకరంగా చెప్పడమో.. లేక చూపించడమే జరగాలి కానీ విరక్తి పుట్టించేలా ఉండటమే కాకుండా అవతలి వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదు అని కొందరి భావన.
ఇక ఇదంతా దేనికి అంటే... ప్రస్తుతం కాలం లో కొంత మంది సోషల్ మీడియా వారు కల్పించి వ్రాస్తున్న న్యూస్ లకు, క్రీట్ చేస్తున్న వీడియోలకు చాలా మంది సెలెబ్రటీల మనోభావాలను దెబ్బతీశారు. బ్రతికి ఉన్న వారిని చంపేస్తున్నారు... ఆరోగ్యాంగా ఉన్నవారిపై ప్రమాదం జరిగి విషమ పరిస్థితి లో ఉన్నారనే వార్తలను సృష్టించేస్తున్నారు... ఈ అసత్య వార్తలను ఖండించలేక కొంతమంది సెలెబ్రెటీలు పోలీసు లకు పిర్యాదు చేస్తున్నారు... తాజా గా హీరో శ్రీకాంత్ కు ఈ రోజు యాక్సిడెంట్ అయింది అంటూ తెలుగు హంట్అనే యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన వీడియో న్యూస్ ను తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. దీంతో హీరో శ్రీకాంత్ ఈ వార్త ను ఖండించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ లైక్స్ కోసం, సబ్స్ క్రైబ్స్ కోసం ఇలా దిగజారుతారా అంటూ మండిపడ్డాడు. నేను బెంగళూరు షూటింగ్ లో ఉండగా నిన్న ఉదయం నుంచి మీకు యాక్సిడెంట్ అయ్యిందట కదా ఎలా ఉంది అంటూ ఫోన్స్ కాల్స్ రావడం మొదలయ్యాయి.. హైదరాబాద్ లో ఉన్న నా కుటుంబ సబ్యులకు కూడా ఈ విషయం తెలిసి కంగారుపడి ఫోన్స్ చేశారు. అలాగే అభిమానుల నుంచి కూడా ఆందోళనకరమైన ఫోన్స్ వస్తున్నాయి.. ఇలా అసత్య న్యూస్ లతో వీడియోలు చేసి వాయిస్ ఓవర్ తో మీ లైక్స్ కోసం, రేటింగ్స్ కోసం వెబ్సైట్ లో ఇలాంటి వార్తలు పెట్టడం చాలా తప్పు, ఇలాంటి వారి పై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుంది.. అలాగే ఇక ముందు ఎవరూ ఇలాంటి అసత్య గాలి వార్తలు రాయొద్దు.
ఎవరో ఓ వ్యక్తి తప్పు చేస్తే దాన్ని తీసుకొని మరికొన్ని వెబ్సైట్, యూట్యూబ్ చానెల్స్ పేపర్స్ లలో వేస్తున్నారు.. ఇది పెద్ద తప్పు.. ఈ విషయం పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా సీరియస్ గా తీసుకుంటుంది.. అలాగే ఈ అసత్య ప్రచారం జరిపిన వారిపై సైబర్ క్రైం ఎస్. పి. రామ్మోహన్ రావు గారికి 'మా' ద్వారా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు హీరో శ్రీకాంత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments